Puttur In Danger : ఏ క్షణమైనా.. పుత్తూరుకు పొంచి ఉన్న ప్రమాదం, భయాందోళనలో ప్రజలు

చిత్తూరు జిల్లా పుత్తూరు టౌన్ కు ప్రమాదం పొంచి ఉంది. సమ్మర్ స్టోరేజ్ ఆనకట్టకు అకస్మాత్తుగా పగుళ్లు ఏర్పడ్డాయి. తెల్లవారుజామున వాకింగ్ కు వెళ్లిన వారు పగుళ్లను గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. పగుళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి, మట్టి

Puttur In Danger : ఏ క్షణమైనా.. పుత్తూరుకు పొంచి ఉన్న ప్రమాదం, భయాందోళనలో ప్రజలు

Puttur In Danger

Puttur In Danger : చిత్తూరు జిల్లా పుత్తూరు టౌన్ కు ప్రమాదం పొంచి ఉంది. సమ్మర్ స్టోరేజ్ ఆనకట్టకు అకస్మాత్తుగా పగుళ్లు ఏర్పడ్డాయి. తెల్లవారుజామున వాకింగ్ కు వెళ్లిన వారు పగుళ్లను గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. పగుళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి, మట్టి పెళ్లలు విరిగిపడుతున్నాయి. ఏ క్షణమైన పుత్తూరు సమ్మర్ స్టోరేజ్ ఆనకట్ట తెగే ప్రమాదం ఉండటంతో పుత్తూరు వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. అధికార యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయ్యింది.

రాత్రికి రాత్రే ఆనకట్టకు పగుళ్లు ఏర్పడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆనకట్టపై ఉన్న రోడ్డు పూర్తి స్థాయిలో కోతకు గురైంది. తెల్లవారుజామున అటుగా వెళ్లిన వాకర్స్… ఈ పగుళ్లు, కోతలు చూసి అవాక్కయ్యారు. వెంటనే నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎందువల్ల ఈ ఆనకట్టకు ఇలా పగుళ్లు వచ్చాయి అనేది అంతుచిక్కని వ్యవహారంగా ఉంది. దీని వల్ల మొత్తం పుత్తూరు పట్టణమే ప్రమాదంలో పడిపోయింది. ప్రమాదాన్ని ఎలా నివారించాలి? ప్రమాదం జరిగితే ఏయే కాలనీలు ముంపునకు గురవుతాయి?అని అంచనాలు వేసే పనిలో అధికారులు ఉన్నారు. ముంపునకు గురయ్యే కొన్ని కాలనీల ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నారు. వారందరిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ ఆనకట్టకు పగుళ్లను ఇప్పటికిప్పుడు ఎలా నివారించాలి అనేది నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏ కారణంగా ఒక్కసారిగా రోడ్డు కోతకు గురైంది? ఈ స్థాయిలో పగుళ్లు ఏర్పడ్డాయి? అనేది మాత్రం అధికారులకు, నిపుణులకు అంతుచిక్కడం లేదు. ఈ ప్రాంతం నగరి నియోజకవర్గంలోకి వస్తుంది. నగరికి ఎమ్మెల్యేగా రోజా ఉన్నారు. ఆమెకు కూడా అధికారులు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆమె సైతం అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. పగుళ్ల నివారణకు చర్యలు తీసుకోవడం, ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.