PV Sindhu : పీవీ సింధును సత్కరించిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్
టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత పివి సింధు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. పీవీ సింధు సాధించిన కాంస్య పతకాన్ని డీజీపీ తిలకించి అభినందించారు. ఏపీకి చెందిన సింధు ప్రపంచ స్థాయిలో పతకం సాధించడం పట్ల డీజీపీ గౌతం సవాంగ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఏపీ రాష్ట్రానికి దక్కిన గౌరవమని ఆయన అన్నారు. సింధు సాధించిన విజయం మహిళలకు, యువతకు ప్రేరణ, స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

PV Sindhu- AP DGP Gautam Sawang : టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత పివి సింధు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. పీవీ సింధు సాధించిన కాంస్య పతకాన్ని డీజీపీ తిలకించి అభినందించారు. ఏపీకి చెందిన సింధు ప్రపంచ స్థాయిలో పతకం సాధించడం పట్ల డీజీపీ గౌతం సవాంగ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఏపీ రాష్ట్రానికి దక్కిన గౌరవమని ఆయన అన్నారు. సింధు సాధించిన విజయం మహిళలకు, యువతకు ప్రేరణ, స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మరెన్నో పతకాలు సాధించి దేశం, రాష్ట్రం కీర్తిప్రతిష్టలను ఇనుమడింప జేయాలని ఆయన డీజీపీ ఆకాంక్షించారు.
సింధు, తల్లిదండ్రులను శాలువాతో డీజీపీ, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు సత్కరించారు. ఏపీ ప్రభుత్వం, పోలీస్ శాఖ మహిళల కోసం చేస్తున్న కృషిని సింధు కొనియాడారు. ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి మహిళ దిశ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలని సింధు కోరారు. పీవీ సింధు టోక్యో ఒలంపిక్స్‌లో కాంస్య పతకం గెల్చుకుంది.
చైనా షట్లర్ బింగ్ జియావోతో జరిగిన బ్యాడ్మింటన్ బ్రోంజ్ మెడల్ మ్యాచ్‌లో పీవీ సింధు విజయం సాధించింది. రెండు మ్యాచుల్లోనూ 21-13, 21-15 పాయింట్స్ తేడాతో పైచేయి సాధించింది. టోక్యో ఒలంపిక్స్‌లో స్వర్ణం చేజార్చుకున్న పీవీ సింధు కాంస్య పథకం (Bronze medal) కైవసం చేసుకుంది. రెండు ఒలంపిక్స్ పతకాలు గెల్చుకున్న తొలి మహిళా అథ్లెట్‌గా పీవీ సింధు చరిత్ర సృష్టించింది.