Bharat Jodo Yatra: ఏపీకి మూడు రాజధానులు అవసరం లేదు .. అమరావతే రాజధాని : రాహుల్ గాంధీ

ఏపీకి మూడు రాజధానులు విషయంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి మూడు రాజధానులు అవసరంలేదని రాజధానిగా అమరావతి ఒక్కటి చాలు అని భారత్ జోడో యాత్ర ఏపీలో కొనసాగుతున్న క్రమంలో రాహుల్ గాంధీ అన్నారు.

Bharat Jodo Yatra: ఏపీకి మూడు రాజధానులు అవసరం లేదు .. అమరావతే రాజధాని : రాహుల్ గాంధీ

Bharat Jodo Yatra Rahul gandhi

Bharat Jodo Yatra In AP : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో రోజూ కొనసాగుతుంది. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కర్నూలులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..దేశాన్ని ఐక్యంగా ఉంచటమే భారత్ జోడో యాత్ర ముఖ్య ఉద్ధేశం అని అన్నారు. అలాగే ఏపీ రాజధాని విషయంలో కొనసాగుతున్న వివాదం గురించి కూడా మాట్లాడుతూ..‘ఏపికి మూడు రాజధానులు అవసరం లేదని..అమరావతి రాజధానిగా చాలు అని అన్నారు. విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలను బీజేపీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. వీలైతే రైతుల పాదయాత్రలో పాల్గొంటానని తెలిపారు.

అలాగే కాంగ్రెస్ పార్టీకి 24 ఏళ్ల తరువాత జరిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక గురించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడే సుప్రీం అని..పార్టీ అంతా అధ్యక్షుడి మాటక కట్టుబడి ఉండాలని స్పష్టంచేశారు. కాగా 7,897 ఓట్లతో కాంగ్రెస్ అధ్యక్షుడిగా శశీ థరూర్ పై మల్లికార్జున ఖర్గే గెలుపు సాధించారు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఈ ఎన్నికల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓటింగ్ ప్రక్రియ సందర్భంగా అక్రమాలు జరిగాయంటూ శశిథరూర్ వర్గం ఆరోపించిది. ఈ ఆరోపణలను ఎన్నికల అధికార వర్గాలు కొట్టిపారేశాయి. అవికేవలం నిరాధామైన ఆరోపణలు అంటూ పేర్కొన్నాయి. ఇద్దరు అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్ల సమ్మతం మేరకు బ్యాలెట్ బాక్స్‌లు సీల్ చేయడం జరిగిందని, వారు బాక్సులపై సంతకం చేయడమే కాకుండా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించినందుకు రిటర్నింగ్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారని ఎన్నికల అధికార వర్గాలు తెలిపాయి.