Rain Alert for Nellore : నెల్లూరుకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బుధ, గురు, శుక్ర వారాల్లో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Rain Alert  for Nellore : నెల్లూరుకు భారీ వర్ష సూచన

Rains Alert In Nellore District

Rain Alert for Nellore :  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బుధ, గురు, శుక్ర వారాల్లో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది.  ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశించారు.

లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని..లోతట్టు ప్రాంతాలను, నీట మునిగే ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తుపాను సమయంలో ప్రజలు త్రాగునీటికి ఇబ్బందిపడకుండా చూడాలని సూచించారు.

Also Read : AP Covid Update : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 348 కోవిడ్ కేసులు

దాదాపు 13ఏళ్ల తర్వాత నెల్లూరు జిల్లాకు తుఫాన్ ముప్పు తప్పేలా కనిపించడం లేదు. తుఫాన్ నెల్లూరు తీరంవైపు దూసుకొస్తోంది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరింతగా పెరిగి.. ఈ రోజు సాయంత్రానికి అతి భారీ వర్షాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. 13 సంవత్సరాల తర్వాత, తిరిగి నెల్లూరును తుఫాన్ తాకనుంది.

2008 నవంబర్‌లో వచ్చిన తుఫాన్ ఒకసారి నెల్లూరు తీరాన్ని తాకింది. ఇప్పుడు మళ్ళీ తుఫాన్ వస్తుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలంతా అప్రమతంగా ఉండి.. అవసరం అయితే తప్ప బయటకు వెళ్లే ప్రయత్నం చేయ వద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని చెరువులన్నీ నిండిపోయి ఉన్నాయని… వరదలు వచ్చే అవకాశం కనిపిస్తోందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు  సూచించారు.