చలి చాలదన్నట్టు : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలి గాలులకు వర్షం తోడైంది. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో వాన కురిసింది. మంగళవారం(డిసెంబర్ 31,2019)

  • Published By: veegamteam ,Published On : January 1, 2020 / 12:32 PM IST
చలి చాలదన్నట్టు : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలి గాలులకు వర్షం తోడైంది. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో వాన కురిసింది. మంగళవారం(డిసెంబర్ 31,2019)

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలి గాలులకు వర్షం తోడైంది. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. మంగళవారం(డిసెంబర్ 31,2019) హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వర్షం పడింది. ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వాన కురిసింది. దీంతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. చలి తీవ్రత పెరిగింది. ఉదయం, రాత్రే కాదు.. మధ్యాహ్నం కూడా చలి తీవ్ర ఉంటోంది. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే జనాలు గజగజ వణుకుతున్నారు. బుధవారం(జనవరి 1,2020) హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది.

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఏపీ, తెలంగాణలో వానలు పడతాయని హైదరాబాద్ వాతావారణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని, చలి తీవ్రత పెరుగుతుందని చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. ఎముకలు కొరికే చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, కూలి పనులు చేసుకునే వారు అవస్థలు పడుతున్నారు. అసలే చలి చంపుతోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇది చాలదన్నట్టు వానలు పడుతున్నాయి. అటు చలి, ఇటు వర్షం.. జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.