ఏపీలో 57 శాతం తక్కువ వర్షపాతం

  • Published By: madhu ,Published On : January 4, 2019 / 01:58 AM IST
ఏపీలో 57 శాతం తక్కువ వర్షపాతం

విజయవాడ :  ఏపీ, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో ఈశాన్య రుతుపవనాలు దిశ మార్చుకున్నాయి. దీనివల్ల గాలుల దిశలో మార్పు చోటు చేసుకొంటోంది. వరుసగా రెండో ఏడాది రుతుపవనాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయని విశాఖ వాతావరణ కేంద్రం చెప్పింది. గత అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఏపీలో మూడు తుఫాన్‌లు వచ్చినా ఆస్తి నష్టమే తప్ప కోస్తాలో వర్షాలు కురువలేదని తెలిపింది. డిసెంబర్ నెలాఖరు వరకు ఏపీలో 57 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని…కోస్తాలో 53.5, రాయలసీమలో 61.5 శాతం తక్కువ నమోదైందని వెల్లడించింది.