AP Telangana Rains : తెలుగు ప్రజలకు చల్లని శుభవార్త : రాబోయే మూడు రోజుల్లో వర్షాలు

తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని శుభవార్త చెప్పింది. రాబోయే మూడు రోజుల్లో ఉండే వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది.

AP Telangana Rains : తెలుగు ప్రజలకు చల్లని శుభవార్త : రాబోయే మూడు రోజుల్లో వర్షాలు

Rains In Telangana And Ap In The Next Three Days

Rains in Telangana and AP : తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని శుభవార్త చెప్పింది. రాబోయే మూడు రోజుల్లో ఉండే వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి మరట్వాడ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు కిలోమీటర్‌ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో ఛతీస్‌గఢ్ , తెలంగాణ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడింది.

తెలంగాణ, ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అటు దక్షిణ కోస్తాంధ్రాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు, సాధారణ ఉష్ణోగ్రతలు కంటే 2 – 3 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది.