Reservoir: జలాశయాలకు వరద నీరు.. ఆనందంలో రైతులు

తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తుండటంతో ఆలమట్టికి 7113 కుసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ఇక జూరాలకు 5 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 6655 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

Reservoir: జలాశయాలకు వరద నీరు.. ఆనందంలో రైతులు

Reservoir

Reservoir: ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతుంది. కర్ణాటక ఆ పై రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఆలమట్టి జయశయానికి నీటి ప్రవాహం పెరిగింది. గురు, శుక్రవారాల్లో ఈ ప్రాజెక్టులో 3 టీఎంసీల మేర స్టోరేజ్ పెరిగింది. శనివారం ఆలమట్టి ప్రాజెక్టుకు 40 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.

తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తుండటంతో ఆలమట్టికి 7113 కుసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ఇక జూరాలకు 5 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 6655 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా వర్షాలు కురుస్తుండటంతో నదిపై ఉన్న చెక్ డ్యాములు. ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టులో నీటి నిల్వ పెరిగింది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఉపనదులు ద్వారా వచ్చిన నీరు గోదావరిలో కలుస్తుంది. దీంతో ఎస్సారెస్పీ, కడెం జలాశయాలకు నీటి ప్రవాహం పెరిగింది.