నిమ్మగడ్డ బసచేసిన రూంలో వేడినీళ్లు రాలేదని టూరిజంశాఖ మేనేజర్ పై సబ్ కలెక్టర్ దాడి

10TV Telugu News

Rajampet sub collector attack on Vontimitta tourism hotel manager : కడపజిల్లా ఒంటి మిట్ట టూరిజం శాఖ మేనేజర్ కిషోర్ పై రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ దాడి చేశారు. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ బసచేసిన రూంలో వేడి నీళ్లు రాలేదని కోపంతో ఆయన కర్రతో మేనేజర్ పై దాడి చేశారు. దీంతో కిషోర్ శరీరంపై వాతలు తేలాయి. కేతన్ గార్గ్ దాడితో మేనేజర్ కిషోర్ అస్వస్ధతకు  గురయ్యారు.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఎక్కడికక్కడ ఎన్నికలపై సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు ఆదేశాలిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతలు, దాడులపైనా దృష్టి పెట్టారు. అందులో భాగంగా కడపలోని ఒంటిమిట్టలోని టూరిజం హోటల్లో బస చేశారు.