టీడీపీకి షాక్..రాజ్యసభకు చెల్లని ఓట్లు వేసిన రెబల్ ఎమ్మెల్యేలు

  • Edited By: murthy , June 19, 2020 / 12:40 PM IST
టీడీపీకి షాక్..రాజ్యసభకు చెల్లని ఓట్లు వేసిన రెబల్ ఎమ్మెల్యేలు

టీడీపీ కి రెబల్ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు.  ఈ రోజు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రెబల్ ఎమ్మెల్యేలు  ఓట్లు చెల్లకుండా  వేసారు.. 173 ఓట్లలో 4 చెల్లని ఓట్లు పడ్డాయి.  రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీతో పాటు  ఓ టీడీపీ ఎమ్మెల్యే  ఓ చెల్లని ఓటు వేశారు.  పార్టీ విప్ జారీ చేయటంతో … ఓటింగ్ లో పాల్గోనడంతో పాటు ఎవరికి ఓటు వేశారో ఏజెంట్ కు చూపాలి . టీడీపీ కి ఓటు వేసినా, ప్రాధాన్యతా స్ధానంలో  టిక్ పెట్టారు రెబల్ ఎమ్మెల్యేలు దీంతో ఓట్లు చెల్లకుండా పోయాయి. చెల్లకుండా ఓటు వేసిన సభ్యులపై చర్యలు తీసుకునే అవకాశం లేదు.