వాళ్లే చూసుకుంటారు : మా అసోసియేషన్‌ వివాదాలపై చెర్రీ స్పందన

  • Published By: madhu ,Published On : January 6, 2020 / 09:00 AM IST
వాళ్లే చూసుకుంటారు : మా అసోసియేషన్‌ వివాదాలపై చెర్రీ స్పందన

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లో జరుగుతున్న పరిణామాలపై మెగాస్టార్ చిరంజీవి తనయుడు, నటుడు రామ్ చరణ్ స్పందించారు. సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలను పెద్దలే చూసుకుంటారని తెలిపారు. మా అసోసియేషన్‌లో వివాదాలను వాళ్లే పరిష్కరించుకుంటారన్నారు. 2020, జనవరి 06వ తేదీ సెల్ ఫోన్ కంపెనీ happi నిర్వహించిన ఓ కార్యక్రమంలో చెర్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీ స్టార్ల హవా నడుస్తోందని చెప్పారు. వెంకటేష్, మహేష్ బాబు మల్టీస్టార్ల సినిమాలు చేశారని గుర్తు చేశారు. తాము కూడా చేసే ప్రయత్నం చేస్తామన్నారు. మీరు బాలీవుడ్‌కు వెళుతారా అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ..బాలీవుడ్ స్టార్లు టాలీవుడ్‌కు వస్తుంటే..మనం అటువైపు వెళ్లడం ఎందుకు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. RRR మూవీకి సంబంధించిన ఇతర విషయాలపై తాను మాట్లాడనని, దర్శకుడు రాజమౌళిని అడగాలని సూచించారు. చిరంజీవి డ్రీమ్‌ను నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో తాను ప్రాజెక్టును స్థాపించడం జరిగిందన్నారు. 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను ‘మా’ అని పిలుస్తుంటారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్స్‌కు సంబంధించిన సంస్థ. ఈ అసోసియేషన్‌లో పెద్ద, చిన్న హీరోలు, ఇతరులు సభ్యులుగా ఉన్నారు. మా డైరీ 2020 ఆవిష్కరణోత్సవం హీరో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు రచ్చ రచ్చ చేశాయి. దీనిని మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా ఖండించారు. 

ప్రస్తుతం రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి 2 సినిమా ఘన విజయం తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట‌ీతో సినిమా రూపొందుతోంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 

Read More : జగన్ ఉన్మాది : 5 కోట్ల ప్రజల సమస్య..అందరూ ఆలోచించండి