Ram Gopal Varma: పిచ్చోడు గెస్టా.. ఎంత అవమానం.. ఆర్జీవీని దేశం నుంచి బహిష్కరించాలి..

Ram Gopal Varma Comments in ANU: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నాగార్జున యూనివర్సిటీలో చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది.

Ram Gopal Varma Comments in ANU: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ వర్సిటీ టూర్ పై రాజకీయ దుమారం రేగింది. నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్ యూ)లో బుధవారం అకడమిక్ ఎగ్జిబిషన్ ను వర్మ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. సంప్రదాయవాదులతో పాటు పలువురు రాజకీయ నేతలు వర్మ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీ నిరసన ప్రదర్శనలు చేపట్టింది.


ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?

నాగార్జున యూనివర్సిటీ అకడమిక్ ఎగ్జిబిషన్ కు రాంగోపాల్ వర్మను ముఖ్యఅతిథిగా పిలవడంపై తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇంతకన్నా అవమానం, అసహ్యకరమైనది ఉండదని పేర్కొంది. అడల్ట్ సినిమాలు తీసే వైఎస్‌ఆర్‌సీపీ అనుచరుడు ఆర్జీవీని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పిలిచారు. విద్యార్థులకు వైస్ ఛాన్సలర్ ఇవ్వాలనుకుంటున్న సందేశం ఏమిటి? అని ప్రశ్నిస్తూ టీడీపీ ట్వీట్ చేసింది.


పిచ్చోడిని గెస్ట్ గా తీసుకొచ్చారు

నాగార్జున యూనివర్సిటీలోకి పిచ్చోడి లాంటి రాంగోపాల్ వర్మను ముఖ్యఅతిథిగా తీసుకొచ్చారని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. విద్యార్థులకు ఏం చెప్పాలో కూడా తెలియని స్థితిలో వర్మ ఉన్నాడని.. సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. విద్యావ్యవస్థను అధికార వైసీపీ పార్టీ భ్రష్టు పట్టిస్తోందని విమర్శించారు.

Also Read: 37 ఏళ్ళ తరువాత డిగ్రీ అందుకున్న RGV పాస్ మార్క్ తెలుసా.. వాళ్ళు నన్ను చెడ గొట్టారు.. వర్మ ట్వీట్!


ఆర్జీవీపై చర్యలు తీసుకోవాలి: వంగలపూడి అనిత

అమరావతి: మహిళలను కించపరిచే వ్యక్తిగా ముద్రపడ్డ రాంగోపాల్ వర్మను నాగార్జున యూనివర్శిటీకి ఆహ్వానించడంపై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలను కించ పరిచేలా కామెంట్లు చేసిన దర్శకుడు ఆర్జీవీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళ కమిషన్, UGC ఛైర్ పర్సన్లకు ఆమె లేఖ రాశారు. నాగార్జున యూనివర్శిటీ వీసీ ప్రొఫెయర్ వి. రాజశేఖర్ పైనా కూడా చర్యలు చేపట్టాలని కోరారు.

ఆర్జీవీ దిష్టిబొమ్మ దగ్ధం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్జీవీ వ్యాఖ్యలకు నిరసనగా ఏబీవీపీ నిరసన చేపట్టింది. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఆర్జీవీ దిష్టిబొమ్మను ఏబీవీపీ కార్యకర్తలు తగలబెట్టారు. రాంగోపాల్ వర్మను దేశం నుంచి బహిష్కరించాలంటూ నినాదాలిచ్చారు. నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: మగాళ్లంతా పోయి, స్త్రీ జాతికి నేనే దిక్కు కావాలి, మరోసారి వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఏం మేసేజ్ ఇద్దామని


ఆర్జీవీపై కేసు పెట్టాలి వీహెచ్

నిర్మల్ జిల్లా: డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాగార్జున యూనివర్సిటీలో మహిళలను కించపరిచే విధంగా ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలను మహిళలందరూ ఖండించాలన్నారు. విద్యార్థుల ముందు అభ్యంతరకర పదజాలంతో మాట్లాడిన ఆర్జీవీకి తగిన గుణపాఠం చెప్పి అవసరమైతే కేసు నమోదు చేయాలని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు