నమ్ముకున్న వారిని నట్టేట ముంచారు, చంద్రబాబుపై రామసుబ్బారెడ్డి ఫైర్

ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు.. నమ్ముకున్న

  • Published By: veegamteam ,Published On : March 12, 2020 / 03:40 PM IST
నమ్ముకున్న వారిని నట్టేట ముంచారు, చంద్రబాబుపై రామసుబ్బారెడ్డి ఫైర్

ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు.. నమ్ముకున్న

ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు.. నమ్ముకున్న వారిని నట్టేట ముంచారని, తన స్వార్థం కోసం నా కుటుంబాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించారని రామసుబ్బారెడ్డి ఆరోపించారు. 2014లో ప్రజలు టీడీపీకి పట్టంకడితే చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు విధానాల వల్లే టీడీపీని వీడాల్సి వచ్చిందని రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

రామసుబ్బారెడ్డి టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోకవర్గంలో పలు మార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఎన్నో ఏళ్లగా టీడీపీలోనే ఉన్నారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీని వీడతారనే ప్రచారం జోరుగా జరిగింది. ఆయన వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని.. పార్టీ మారడం ఖాయమని ఊహాగానాలు వినిపించాయి. 2019 ఎన్నికలకు ముందు జమ్మలమడుగు టీడీపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది.

ఎప్పటి నుంచో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయణరెడ్డి-రామసుబ్బారెడ్డిలు రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య కొద్దిరోజులు కోల్డ్ వార్ నడిచింది. రంగంలోకి దిగిన చంద్రబాబు.. ఇద్దరు నేతలతో చర్చలు జరిపి రాజీ చేశారు. జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి.. కడప లోక్‌సభ స్థానం నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేశారు.. కానీ ఇద్దరికీ ఓటమి తప్పలేదు. తర్వాత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఆదినారాయణ రెడ్డితో స్నేహం ఇష్టం లేకపోయినా చంద్రబాబు బలవంతం చేయడంతో రామసుబ్బారెడ్డి ఏమీ అనలేకపోయారు.