సుప్రీంకు వెళుతాం..రమేశ్ కుమార్‌కు సిగ్గుంటే..రాజీనామా చేయాలి – విజయసాయిరెడ్డి

  • Published By: madhu ,Published On : March 15, 2020 / 01:33 PM IST
సుప్రీంకు వెళుతాం..రమేశ్ కుమార్‌కు సిగ్గుంటే..రాజీనామా చేయాలి – విజయసాయిరెడ్డి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు నిజంగా..సిగ్గుంటే..నైతిక విలువలుంటే..రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, ఎన్నికల కమిషనర్ తీరుపై సుప్రీంకోర్టుకు వెళుతామని స్పష్టం చేశారు. నిమ్మగడ్డ రమేశ్..కు బదులు..నారావారి గబ్బిలం అని పిలిస్తే..బాగుంటుందేమోనని అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిపై తమకు గౌరవం ఉందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యక్తి నిమ్మగడ్డ రమేశ్ కాదు..నారవారా రమేశ్ అని చెప్పుకోవాలన్నారు. 

స్థానిక ఎన్నికలు వాయిదా వేయడంపై వైసీపీ సీరియస్‌గా పరిగణిచింది. బాబు కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. 2020, మార్చి 15వ తేదీ ఆదివారం వైసీపీ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయి మాట్లాడుతూ…

చట్టవిరుద్దమైన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి..అలాంటి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. ఆర్టికల్ 243 కే, 243 జెడ్ ఏ ఉపయోగించారని గుర్తు చేశారు. పరిస్థితి తీవ్రతను బట్టి..ఈ ఆర్టికల్‌ను ఉపయోగించి..నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. కానీ కరోనా వైరస్ కేవలం ఒకే ఒక్క వ్యక్తికి మాత్రమే సోకిందని, ఇతను కూడా ఇటలీ నుంచి వచ్చాడని, ప్రస్తుతం బాగానే ఉన్నాడని తెలిపారు. ఈ క్రమంలో ఎన్నికలను ఎందుకు వాయిదా వేశారో అర్థం కావడం లేదన్నారు. టీడీపీకి హెల్ప్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి పనిచేశారని దుయ్యబట్టారు. 

బాబుతో కలిసి..నిమ్మగడ్డ రమేశ్ తీసుకున్న నిర్ణయం ప్రజలు హర్షిస్తారా ? లేదా ? అనేది కాలం నిర్ణయిస్తుందన్నారు. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణపై పలు విమర్శలు చేశారాయన. బాబుకు అమ్ముడుపోయారని, వ్యక్తిగతంగా..బాబు అడుగుజాడల్లోనే నడుస్తున్నారని, ఇది బీజేపీకి ప్రమాదమని ఎంపీ విజయసాయి హెచ్చరించారు. 

Read More : బాబు ద్రోహి : ప్రజాస్వామ్యం బతికిందా ? ఖూని అయ్యిందా ? – మంత్రి అవంతి