Ransomware : తెలుగు రాష్ట్రాల్లో ర్యాన్సమ్ వేర్ దాడులు.. లక్షల్లో వసూలు చేస్తున్న కేటుగాళ్లు

Ransomware : తెలుగు రాష్ట్రాల్లో ర్యాన్సమ్ వేర్ దాడులు.. లక్షల్లో వసూలు చేస్తున్న కేటుగాళ్లు

Ransomware

Ransomware : ర్యాన్సమ్ వేర్ దాడులు ఈ మధ్య పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ తరహా దాడులు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు.. కానీ కంప్యూటర్ లోని సమాచారం మొత్తం లాక్ అయిపోతుంది. అడిగినంత డబ్బులు ఇస్తే కానీ డీక్రిప్ట్ (decrypt) చేస్తున్నారు కేటుగాళ్లు.

తాజాగా విజయవాడకు చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ల్యాప్ టాప్ సడన్ గా లాక్ అయిపొయింది. తర్వాత లాక్ డిక్రీప్ట్ చేయాలంటే తమకు క్రిస్టో కరెన్సీ రూపంలో 1060 డాలర్లు డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. డబ్బు ఇస్తేనే ఫోల్డర్ లాక్స్ తీస్తామని మెయిల్ పంపారు. కాగా నాలుగేళ్లుగా వెంకటేశ్వర్లు చేసిన ప్రాజెక్టులన్నీ అందులోనే ఉన్నాయి. ఫోల్డర్లు లాక్ కావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు.

ఇక ఇదే తరహా ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఆసుపత్రులకు మందులు పరికరాలు సరఫరా చేసే కంపెనీ సిస్టమ్ ని లాక్ చేశారు. తమకు 3400 డాలర్లు ఇస్తేనే లాక్ తీస్తామని మెయిల్ పంపారు. ఆసుపత్రులకు సరఫరా చేసిన మందుల బిల్లులు, పరికరాల వివరాలు మొత్తం అందులోనే ఉండిపోవడంతో సంస్థ ప్రతినిధులు అడిగినంత సమర్పించుకున్నట్లు సమాచారం. ఈ ర్యాన్సమ్ వేర్ ఎక్కడి నుంచి ఎలా వస్తుందో తెలియడం లేదు. కానీ క్షణాల వ్యవధిలో ఫోల్డర్లు మొత్తం లాక్ అయిపోతున్నాయి.

ఆ లాక్ తీయడం స్థానికంగా ఉన్న నిపుణలకు కూడా తెలియడం లేదు. దీంతో మెయిల్ లో అడిగినంత ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఈ దాడులు పెద్ద పెద్ద కంపినీలనే కాదు. ముఖ్యమైన డేటా ఉన్న దేనినైనా టార్గెట్ చేసి ఇబ్బందిలు కలిగిస్తుంది. తాజాగా అమెరికాలో 1500 షాపులపై ర్యాన్సమ్ వేర్ పడినట్లు సమాచారం. డేటాకు లాక్ వేసి కోట్లలో దండుకుంటున్నారు. వీరు ఎక్కడినుంచి పనిచేస్తున్నారు. వీరి వెనుక ఎవరున్నారు అనేది మాత్రం ఇప్పటికి తెలియరాలేదు.

ఇక సైబర్ దాడి మన అలసత్వం వల్ల కూడా జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తెలియని లింక్ లను ఓపెన్ చేయడం వలన ఇటువంటివి ఎటాక్ చేస్తాయని చెబుతున్నారు. లింకులు, ఎటాక్ మెంట్లు రూపంలో ఎరవేసి ర్యాన్సమ్ వేర్ ను చొప్పిస్తారని చెబుతున్నారు. బ్యాంకు అకౌంట్ ద్వారా కాకుండా క్రిష్టో కరెన్సీ రూపంలో వసూలు చేస్తుండటంతో వీరిని పట్టుకోవడం కష్టంగా మారింది.

ఇక దీని నుంచి బయటపడేందుకు మార్గాలు చెబుతున్నారు నిప్పులు

* ర్యాన్సమ్ వేర్ ఎటాక్ కాకుండా ఉండాలి అంటే సిస్టమ్ షెడ్ డౌన్ చేసే సమయంలో నెట్ కనెక్షన్ తీసేయాలని చెబుతున్నారు.
* సిస్టమ్ లో లైసెన్స్ కలిగిన యాంటీ వైరస్ లు వేసుకోవాలి.
* ఆపరేటింగ్ సిస్టమ్ విషయంలో జాగ్రత్తలు వహించాలి. లైసెన్స్ కలిగిన ఆపరేటింగ్ సిస్టమ్ వాడాలి.
* సిస్టమ్ లోని విలువైన సమాచారం బ్యాక్ అప్ చేసి భద్రపరుచుకోవాలి

ఇలా జాగ్రత్తలు పాటిస్తే ర్యాన్సమ్ వేర్ లాంటి వాటికి దూరంగా ఉండవచ్చు.