Rape Attempt : ఏపీలో మరో దారుణం.. ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారయత్నం

మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులకు మరణ శిక్షలు విధించినా.. ఎన్‌కౌంటర్లు చేసినా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడవాళ్లపై అత్యాచారాలు ఆగడం

Rape Attempt : ఏపీలో మరో దారుణం.. ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారయత్నం

APSRTC Driver

Rape Attempt : మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులకు మరణ శిక్షలు విధించినా.. ఎన్‌కౌంటర్లు చేసినా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడవాళ్లపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో గల సీతానగరం పుష్కరఘాట్ దగ్గర ప్రేమజంటపై దాడి చేసి యువతిపై అత్యాచారం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

Venu Swamy: రకుల్‌కు షాక్.. ప్రేమ విఫలమవుతుందని చెప్పిన వేణుస్వామి!

తాడేపల్లిలో గ్యాంగ్ రేప్ ఘటన మరువక ముందే గుంటూరులో మరో దారుణం చోటు చేసుకుంది. గుంటూరు నగర శివారులో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచార యత్నం కలకలం రేపింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తున్న విద్యార్థినిపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. అత్యాచారానికి యత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో వారు పారిపోయారు.

తాడికొండ మండల పరిధి మోతడకలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న యువతి తన స్నేహితుడితో కలిసి గురువారం గుంటూరుకు బయల్దేరింది. ప్రయాణ సమయంలో కాసేపు రోడ్డు పక్కన ఆగారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కొందరు యువకులు కర్రలతో వారిపై దాడి చేశారు. యువతిని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లేందుకు యత్నించారు. అయితే, యువతి కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

Sextortion Racket : స్ట్రిప్‌చాట్ పేరుతో 200 మందిని రూ.22 కోట్లు మోసం చేసిన ముఠా గుట్టురట్టు

గురువారం రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. బాధిత యువతి, ఆమె స్నేహితులు శనివారం తాడికొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. విద్యార్థినిపై అత్యాచారయత్నం స్థానికంగా కలకలం రేపింది. మహిళలపై జరుగుతున్న ఘోరాలు ఆడపిల్లల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఆడపిల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకునే వరకు కంగారు పడాల్సిన పరిస్థితి నెలకొంది.