Veera Brahmendra Swamy : బ్రహ్మంగారి మఠంలో వారసత్వ వివాదం.. ఆస్తుల కోసమేనా?

కడప జిల్లాలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో ఏర్పడిన పీఠాధిపతి వివాదాన్ని కొంతమంది కావాలనే సృష్టించారా? ఆస్తులపై ఆధిపత్యం కోసమే అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టారా? మఠంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు బయట పడకుండా ఉండేందుకే ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారా? పరిస్థితులు చూస్తుంటే నిజమే అనే సమాధానం వినిపిస్తోంది.

Veera Brahmendra Swamy : బ్రహ్మంగారి మఠంలో వారసత్వ వివాదం.. ఆస్తుల కోసమేనా?

Veera Brahmendra Swamy

Veera Brahmendra Swamy : కడప జిల్లాలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో ఏర్పడిన పీఠాధిపతి వివాదాన్ని కొంతమంది కావాలనే సృష్టించారా? ఆస్తులపై ఆధిపత్యం కోసమే అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టారా? మఠంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు బయట పడకుండా ఉండేందుకే ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారా? పరిస్థితులు చూస్తుంటే నిజమే అనే సమాధానం వినిపిస్తోంది.

బ్రహ్మంగారి మఠం మేనేజర్ పైనే ఇప్పుడు ప్రధానంగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. బ్రహ్మంగారి మఠానికి కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. మొత్తం 85 ఎకరాల వ్యవసాయ పొలం, దాదాపు రూ.9కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు, వీటితో పాటు పలు వ్యాపార సముదాయ భవనాలు ఉన్నాయి. ఇవే కాకుండా ప్రసాదాలు, దర్శనం టికెట్లు, టెంకాయల టెండర్లు, హుండీల ద్వారా మరింత ఆదాయం వస్తుంది.

అయితే ఈ ఆదాయ వ్యవహారాలన్నీ చూసే మఠం మేనేజర్ పనితీరు పైనే ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మఠం మేనేజర్, సిబ్బంది కలిసి కోట్ల రూపాయల అవినీతి చేశారంటూ గ్రామస్తులు, భక్తులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేసేందుకు వచ్చిన మఠం మేనేజర్ ఇప్పుడు కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మేనేజర్ తో పాటు పలువురు సిబ్బంది మఠంలోనే విలాసవంతమైన ఇళ్లు నిర్మించుకున్నారని, హుండీ ఆదాయం కూడా పక్కదారి పట్టిందన్న ఆరోపణలు ఉన్నాయంటున్నారు. ఈ వ్యవహారాలను పక్కదారి పట్టించేందుకే పీఠాధిపతి అంశాన్ని వివాదం చేశారని, కావాలనే అన్నదమ్ముల మధ్య మేనేజర్, కొంతమంది సిబ్బంది వివాదం సృష్టించారని గ్రామస్తులు అంటున్నారు.

ఇదిలా ఉంటే, తాను ఒక్కడిని మాత్రమే సంపాదించుకోవడం లేదని, కొంతమంది పూజారులు కూడా ఆస్తులు వెనకేసుకున్నారని మేనేజర్ అన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా మేనేజర్ తో పాటు మఠం సిబ్బంది ఆస్తులపై విచారణ జరిపితేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని గ్రామస్తులు అంటున్నారు.

మరోవైపు బ్రహ్మంగారి మఠంలో రెండవ రోజు పీఠాధిపతులు.. రెండో భార్య మారుతి మహాలక్ష్మి కుమారుల అభిప్రాయ సేకరణ చేపట్టారు. రెండవ భార్య మారుతి మహాలక్ష్మి తన కుమారుని పీఠాధిపతిగా నియమిస్తే, తాను నామినీగా వ్యవహరిస్తానని పీఠాధిపతులకు తెలియజేసినట్లు సమాచారం. తన కుమారుడు పీఠాధిపతిగా అవ్వడం తన భర్త ఆఖరి కోరికనీ, తనతో ప్రమాణం చేయించుకున్నారని పీఠాధిపతులకు తెలియజేసింది. పీఠాధిపత్యం తనకు దక్కని పక్షంలో కోర్టుకు వెళ్తానని ఖరాఖండిగా తెలియజేసినట్లు సమాచారం. పీఠాధిపతులు బలవంతంగా పీఠాధిపత్యం పెద్ద భార్య కుమారులకు ఇస్తే, తాను తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమని తెలియజేసినట్లు సమాచారం.