Red Cross Oxygen : ఇంటికే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్, రెడ్‌క్రాస్ ఉదారత

కరోనా కష్టకాలంలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ (ఐఆర్‌సీఎస్‌) ఉదారత చాటుకుంది. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో బాధితులకు అవసరమైన ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను సరఫరా చేసేందుకు సిద్ధమైంది.

Red Cross Oxygen : ఇంటికే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్, రెడ్‌క్రాస్ ఉదారత

Red Cross Society To Deliver Oxygen Concentrator To Home

Red Cross Oxygen : కరోనా కష్టకాలంలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ (ఐఆర్‌సీఎస్‌) ఉదారత చాటుకుంది. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో బాధితులకు అవసరమైన ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను సరఫరా చేసేందుకు సిద్ధమైంది. ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లను ఇంటికే సరఫరా చేయనుంది. ఐఆర్‌సీఎస్‌ జీవితకాల సభ్యత్వం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. అవసరమైన వారు డాక్టర్ సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఇంటి దగ్గర వినియోగించుకునేలా ధ్రువీకరణ అవసరం. రోగి, సహాయకుని ఆధార్‌ కార్డు జిరాక్స్ కాపీలను రెడ్‌ క్రాస్‌ సొసైటీ బ్రాంచిలో సమర్పించాలి. వారం రోజులకు మాత్రమే ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ అందిస్తారు. ఒకవేళ వారానికి మించి అవసరం వస్తే అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ నిల్వలను బట్టి సరఫరా చేస్తారు.

వారానికి సాధారణ సర్వీసు ఛార్జి కింద వెయ్యి రూపాయలు వసూలు చేస్తారు. కంప్రెషన్‌ నిర్వహణ, ఫిల్టర్లు మార్చడం తదితర ఖర్చుల కోసమే ఈ మొత్తం వసూలు చేస్తున్నామని తెలిపారు. ఒకవేళ ఎవరైనా పేదలు కనీస ఛార్జి రూ.1,000 కూడా భరించలేని పరిస్థితుల్లో ఆ మొత్తమూ తీసుకోకుండా ఇచ్చే అధికారం ఐఆర్‌సీఎస్‌ జిల్లా బ్రాంచికి ఉంటుంది. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ పేరు మీద సెక్యూరిటీ నిమిత్తం బ్యాంకు చెక్కును ఇవ్వాల్సి ఉంటుంది. కాన్సన్‌ట్రేటర్‌ తిరిగి ఇచ్చిన తర్వాత ఆ చెక్కును ఇచ్చేస్తారు. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ రవాణా ఛార్జీలు రోగి, సహాయకులే భరించాలి. పూర్తి వివరాలకు రెడ్‌ క్రాస్‌ సొసైటీ టోల్‌ ఫ్రీ నెంబర్ 1800-425-1234 కాల్ చేయాలి.