Red sanders: అనంతపురంలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరులో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Red sanders: అనంతపురంలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

Red sanders: అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరులో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొడికొండ చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా లారీలో తరలిస్తున్న 38 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు.

దుంగలతో పాటు లారీని, ఓ బైక్‌, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. వీటి విలువు దాదాపు 40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఈ ముఠా ఎర్రచందనం దుంగలను కడప నుంచి బెంగళూరుకు చేర్చిన తర్వాత.. అక్కడి నుంచి మరో ముఠా వీటిని చైనా, వియత్నాం, శ్రీలంకకు తరలిస్తున్నారని ఏఎస్పీ రామ్మోహన్‌ తెలిపారు. నిందితులపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని చెప్పారు.