ఏపీలో మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

ఏపీలో 15 కార్పోషన్లకుగానూ 12 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహిస్తారు. నెల్లూరు, శ్రీకాకుళం, రాజమండ్రి కార్పొరేషన్ లలో ఎన్నికలు వాయిదా పడ్డాయి.

  • Published By: veegamteam ,Published On : March 9, 2020 / 02:28 PM IST
ఏపీలో మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

ఏపీలో 15 కార్పోషన్లకుగానూ 12 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహిస్తారు. నెల్లూరు, శ్రీకాకుళం, రాజమండ్రి కార్పొరేషన్ లలో ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఏపీలో 15 కార్పోషన్లకుగానూ 12 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహిస్తారు. నెల్లూరు, శ్రీకాకుళం, రాజమండ్రి కార్పొరేషన్ లలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 104 మున్సిపాలిటీలకుగానూ 75 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 29 మున్సిపాలిటీల్లో కోర్టు కేసుల రీత్యా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఒకే విడతలో కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. 

మార్చి 11 నుంచి 13 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 14న పరిశీలన ఉంటుంది. మార్చి 16న మధ్యాహ్నం 3గంటలలోపు నామినేషన్ల ఉపసహంరణకు గడువు ఇచ్చారు. మార్చి 23న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంట వరకు పోలింగ్ జరుగనుంది. మార్చి 27న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. 

అమరావతి రాజధానిలోని 29 గ్రామాలు స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండనున్నాయి. పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం ఎస్‌ఈసీని కోరింది. పంచాయతీలను కార్పొరేషన్‌లలో విలీనం చేసినందుకు ఎన్నికలు నిలిపివేయాలని చెప్పింది. అమరావతి క్యాపిటల్‌ సిటీ మున్సిపల్ కార్పొరేషన్‌ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించామని ప్రభుత్వం తెలిపింది. ఆయా గ్రామాల్లో పంచాయతీ, పరిషత్‌ ఎన్నికలు నిర్వహించవద్దని ఏపీ ప్రభుత్వం ఈసీని కోరింది. 

అమరావతి సిటీని మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రభుత్వం ఇంతకముందే ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు నిలిపివేయాలని అప్పట్లో కోర్టులో రైతులు కేసులు వేశారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో రైతులు దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. సీర్డీఏ చట్టం రద్దు చేయకుండా ఏ విధంగా మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేస్తారని రాజధాని ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఏపీలో 103 మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. బీసీలు, మహిళలకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఎస్టీ మహిళలకు 2 స్థానాలు, ఎస్టీ జనరల్ ఒక స్థానం, ఎస్సీ జనరల్ 7 స్థానాలు, ఎస్సీ మహిళలకు 7 స్థానాలు, బీసీ జనరల్ 17 స్థానాలు, బీసీ మహిళలకు 17 స్థానాలు, జనరల్ మహిళలకు 26 స్థానాలు, జనరల్ 26 స్థానాలు కేటాయించారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పురపాలక, నగర పంచాయతీ స్థానాలకు, రిజర్వేషన్లను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు రిజర్వేషన్లు కేటాయిస్తూ పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్ గెజిట్ విడుదల చేశారు.