ఆ రంగులు తొలగించాల్సిందే, జగన్ సర్కార్ కి సుప్రీంకోర్టు ఆదేశం

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో బుధవారం(జూన్ 3,2020) విచారణ జరిగింది. 4 వారాల్లో రంగులు తొలగించాలని జగన్ ప్రభుత్వాన్ని

  • Published By: naveen ,Published On : June 3, 2020 / 06:52 AM IST
ఆ రంగులు తొలగించాల్సిందే, జగన్ సర్కార్ కి సుప్రీంకోర్టు ఆదేశం

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో బుధవారం(జూన్ 3,2020) విచారణ జరిగింది. 4 వారాల్లో రంగులు తొలగించాలని జగన్ ప్రభుత్వాన్ని

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు(గ్రామ పంచాయతీ కార్యాలయాలు) రంగుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో బుధవారం(జూన్ 3,2020) విచారణ జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో రంగులు తొలగించాలని జగన్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రంగులు తొలగించకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం చెప్పింది. ఈ కేసులో ఏపీ ప్రభుత్వ వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రంగుల వ్యవహారంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్లిన విషయం తెలిసిందే. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారించిన కోర్టు, ఆ పిటిషన్ ను కొట్టివేయడమే కాకుండా రంగులు తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది.

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం వివాదానికి దారితీసింది. దీన్ని తప్పుపడుతూ కొందరు హైకోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం సరికాదని చెప్పింది. వెంటనే ఆ రంగులు తొలగించాలని కొన్ని రోజుల క్రితం హైకోర్టు తీర్పు ఇచ్చింది. రంగులకు సంబంధించిన జీవోని కోర్టు రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం 4 వారాల్లో రంగులు తొలగించాలని ఆదేశించింది. వైసీపీ జెండాను పోలిన రంగులను నాలుగు వారాల్లో తొలగించకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. 

పంచాయతీ కార్యాలయాల భవనాలకు రంగులు వేయాలని జగన్ ప్రభుత్వం జీవో నంబర్ 623 తీసుకొచ్చింది. ఇది వివాదానికి దారితీసింది. భవనాలపై వైసీపీ జెండా రంగులే కనిపిస్తున్నాయని కొందరు హైకోర్టుని ఆశ్రయించడం, హైకోర్టు జీవోని కొట్టివేయడం జరిగాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది.