ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన…ఐదు కీలక తప్పిదాలను బయటపెట్టిన కమిటీ

  • Published By: srihari ,Published On : June 1, 2020 / 09:27 AM IST
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన…ఐదు కీలక తప్పిదాలను బయటపెట్టిన కమిటీ

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై ఎన్జీటీ విచారణ కమిటీ నివేదికను సమర్పించింది. ఎల్జీ పాలిమర్స్ నిర్లక్ష్యాన్ని, తప్పిదాలను కమిటీ ఎండగట్టింది. ఐదు కీలక తప్పిదాలను బయటపెట్టింది. స్టైరిన్ పాలిమరైజేషన్ ను నిలువరించే టీబీసీ స్టోరేజ్ తగినంత అందుబాటులో లేదని కమిటీ తేల్చింది. ఆక్సిజన్ ను ఆవిరిగా మార్చే క్రమంలో మానిటరింగ్ సిస్టమ్ అమలు చేయట్లేదని వెల్లడించారు. ఉష్ణోగ్రతలను పర్యవేక్షణ చేసే వ్యవస్థను కూడా సరిగ్గా పాటించలేదని తేల్చింది. రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ను 24 గంటలపాటు ఆపరేట్ చేయలేదని కమిటీ చెబుతోంది.

మే7న విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ లో స్టైరిన్ గ్యాస్ లీకేజీ ఘటనపై మే8న ఎన్జీటీ విచారణ చేపట్టి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పూర్తిస్థాయిలో ఎల్జీ పాలిమర్స్ సంస్థలోకి వెళ్లి పలుమార్లు సందర్శించి పూర్తిస్థాయి నివేదికను సమర్పించింది. ఐదుగురు సభ్యుల కమిటీ పూర్తిగా మానవ తప్పిదం, నిర్లక్ష్యం, అధికారులు పట్టించుకోకపోవడం, ఎల్జీ పాలిమర్స్ సంస్థలో సరైన యంత్రాంగం లేకపోవడం వంటి అంశాలను నివేదికలో పేర్కొన్నారు.

స్టైరైన్ లీకేజీ జరిగినప్పుడు కట్టడికి కావాల్సిన రసాయనాలు లేవని సంస్థలో లేవని, అలాగే గ్యాస్ లీకైనప్పుడు ప్రజలను అప్రమత్తం చేసే అలారమ్ సిస్టమ్ వినిపించడం లేదని, భద్రతా సిబ్బంది వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం, స్టైరైన్ స్టోరేజీ ట్యాంక్స్ పాతవి కావడం, ఉష్ణోగ్రతలను సూచించే సూచికలు, యంత్రాలు లేకపోవడం, రాత్రి పూట కూలింగ్ సిస్టమ్ ను ఆన్ చేసి ఉంచాలి. కానీ అవేది చేయకుండా వాతావరణ పరిస్థితులు చల్లగా ఉంటున్నాయని, కూలింగ్ సిస్టమ్ ను కూడా 24 గంటలు నడిపించకుండా సాయంత్రం అయ్యే సరికి ఆఫ్ చేయడంతోటి ఈ ప్రమాదం చోటు చేసుకుందని నివేదికలో పొందుపర్చారు. ఈ కమిటీ నివేదికపై ఎన్టీటీలో విచారణ జరుగుతోంది. మే8న జరిగిన విచారణలో భాగంగా కమిటీని వేసి..పూర్తిస్థాయిలో నివేదికను సమర్పించాలని ఆదేశించారు. 

ఈ కమటీ ఇవాళ ఎల్జీ పాలిమర్స్ సంస్థ తప్పిదాలను నివేదికలో పొందుపర్చి సమర్పించారు. ఈ నివేదికపై ఎన్జీటీ తదుపరి ఉత్తర్వులను ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈఘటనను ఎన్జీటీ సుమోటోగా స్వీకరించటాన్ని ఎల్జీ పాలిమర్స్ ఇప్పటికే తప్పుపడుతుంది. అలాగే రూ.50 కోట్లను డిపాజిట్ చేయమనడాన్ని పూర్తిగా తప్పుబడుతుంది. ఇదే అంశంపై ఎల్జీపాలిమర్స్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని, ఏ అంశాలున్న ఎన్జీటీ ముందే లేవనెత్తాలని సూచించడంతో ఎల్జీపాలిమర్స్ సంస్థ కూడా తమ వాదనలను ఎన్జీటీ ముందు వినిపించబోతుంది. 

అయితే ఈ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది చనిపోయారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. విశాఖలో ఇంకా భయాందోళనలు నెలకొని ఉన్నాయి. ఎన్జీటీ ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది? ఇప్పటికే హైకోర్టు ఎల్జీపాలిమర్స్ ను మూసివేయాలని ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టులో కూడా కేసు కొనసాగుతోంది. ఎల్జీ పాలిమర్స్ తరపున ఎటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. నివేదిక పట్ల ఎన్జీటీ ఏ విధంగా స్పందిస్తుందనే వేచి చూడాలి. 

Read: బెజవాడ గ్యాంగ్ వార్.. సందీప్ మృతదేహం నేరుగా స్మశాన వాటికకు తరలింపు