రెస్టారెంట్ పేరు.. నా POTTA నా ISTAM

రెస్టారెంట్ పేరు.. నా POTTA నా ISTAM

Naa POTTA Naa ISTAM : ట్రెండ్ మారుతోంది..కొత్త కొత్తగా ఆలోచిస్తున్నారు. వ్యాపార రంగంలో అయితే..కస్టమర్లను ఎలా ఆకర్షించాలనే దానిపై కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. వెస్ట్రన్ పేర్ల కంటే..అచ్చమైన తెలుగు భాష వైపు మొగ్గు చూపుతున్నారు. హోటలైనా..షాపైనా..సంప్రదాయ తెలుగు పేర్లను పెడుతున్నారు. వ్యాపారం క్లిక్ కావాలంటే..కాస్తైనా..వెరైటీ చూపెట్టాలి మరి అంటున్నారు.

ప్రధానంగా హోటల్స్, రెస్టారెంట్స్ గురించి. ట్రెడిషనల్ నేమ్స్ తో పాటు.. ప్రకృతి, లేదా పండుగలకు రిలేటెడ్ గా ఉన్న పేర్లను ఎంచుకుంటున్నారు. హోటల్ పేరు నుంచి మొదలుకుని అన్నింటిలో తమ స్టైల్ ను చూపిస్తున్నారు. పేరుతోనే ప్రమోషన్ చేయించుకుంటున్నారు. వెరైటీ వెరైటీ పేర్లు పెడుతూ…కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఇటీవలే..పొట్ట పెంచుదాం..అనే రెస్టారెంట్ పేరు విన్న సంగతి తెలిసిందే.

తాజాగా.. మరో హోటల్ పేరు నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవలే కొత్తగా ప్రారంభమైన ఆ హోటల్ పేరు చూసి నవ్వు ఆపలేకపోతున్నారు. ఆ హోటల్ పేరు ‘నా POTTA నా ISTAM’. ఇక్కడ ఎంతైనా తినాలనిపిస్తుంది అని కస్టమర్లు చెబుతున్నట్లుగా ఉంది అంటున్నారు. నెట్టిజన్లు ఫన్నీ కామెంట్స్ తెగ వైరల్ చేస్తున్నారు. పేర్లు పెట్టాలన్నా..సెటైర్లు వేయాలన్నా..గోదారోళ్ల తర్వాతే..అంటున్నారు. రాజమండ్రిలోని దానవాయిపేటలో ఈ హోటల్ ఉన్నట్లు సమాచారం. పాతాళభైరవి, మాయాబజార్ ఇలాంటి పేర్లతో హోటల్స్ ఉన్న సంగతి తెలిసిందే.

కొబ్బరిల్లు, విస్తరి, నాటుకోడి, ఉలవచారు, అరిటాకు, విందు, పందెంకోడి, కోడికూర, చిట్టిగారె, వియ్యాలవారి విందు, ఆహా, సుబ్బయ్యగారి హోటల్, బాబాయ్ హోటల్ ఇలా పేర్లతోనే నోరూరిస్తున్నారు వ్యాపారులు.