Neelakantapuram : నీలకంఠాపురంలో అంగరంగవైభవంగా ఆలయాల నిర్మాణం…

6000 వేల సంవత్సరాల నాటి దేవాలయం.. ఇంతటి చరిత్రగలిగిన ఆలయ జీర్ణోద్ధరణ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగవైభవంగా జరగనుంది. ఇదెక్కడో కాదు అనంతపురం జిల్లాలోని మడకశిరకు దగ్గరలో ఉన్న నీలకంఠాపురం గ్రామంలో...

Neelakantapuram : నీలకంఠాపురంలో అంగరంగవైభవంగా ఆలయాల నిర్మాణం…

Restoration Of An Ancient Temple Neelakantapuram Village

Restoration of Ancient Neelakantapuram Temple : 6000 వేల సంవత్సరాల నాటి దేవాలయం.. ఇంతటి చరిత్రగలిగిన ఆలయ జీర్ణోద్ధరణ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగవైభవంగా జరగనుంది. ఇదెక్కడో కాదు అనంతపురం జిల్లాలోని మడకశిరకు దగ్గరలో ఉన్న నీలకంఠాపురం గ్రామంలో… మాజీ మంత్రి ఎన్.రఘువవీరా రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్ధులంతా కలసి గ్రామానికే వన్నెతెచ్చే మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

రెండెకరాల స్ధలంలో ఉన్న నీలకంఠేశ్వర స్వామి ఆలయంతోపాటు, అనుబంధంగా 15 మంది దేవతామూర్తులకు ఆలయాలను సర్వాంగ సుందరంగా నిర్మించారు. ఆలయానికి ఎదురుగా 52 అడుగుల ఎత్తుగల పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు. ఆగమశాస్త్రాలకు అనుగుణంగా నాలుగుదిక్కులకు నాలుగు ప్రవేశమార్గాలు ఏర్పాటు చేయటమే కాకుండా మాడవీధుల నిర్మాణం కూడా చేశారు. ఆలయ నిర్మాణంలో చారిత్రక కళావైభం ఉట్టిపడేలా కళాకారులు తమ ప్రతిభను కనబరిచారు.

ఆలయ నిర్మాణంలో స్ధానికుల భాగస్వామం తీసుకుని దేవాలయం నిర్మాణాకి అవసరమైన కోటి ఇటుకలను రఘువీరారెడ్డి సేకరించారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలనుండి మట్టి, తీర్ధాలను , పవిత్ర నదుల నుండి జలాలను నిర్మాణానికి వినియోగించారు. దేవాలయల నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. అనంతపురం ప్రాంతానికే ప్రత్యేక గుర్తింపు తీసుకురానున్న నీలకంఠాపురం ఆలయాల విగ్రహాలకు ఈనెల 19 నుండి 23 వరకు శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఆలయ ప్రారంభోత్సవానికి ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన స్వామీజీలను ఆహ్వానించారు. మరోవైపు ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు సైతం నీలకంఠాపురం గ్రామంలో చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అభినందిస్తూ గ్రామస్ధులకు లేఖ కూడా రాశారు. కరోనా నిబంధనలు అమలులో ఉన్న నేపధ్యంలో దానికి అనుగుణంగా ఆలయాల ప్రారంభ కార్యక్రమం నిర్వహించేలా మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు.