శ్రీవారి ఆలయంలో మార్చిలో ఆర్జిత సేవల పునరుద్ధరణ

శ్రీవారి ఆలయంలో మార్చిలో ఆర్జిత సేవల పునరుద్ధరణ

Restoration of arjitha services at Srivari Temple  : తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో ఆర్జిత సేవలు పునరుద్ధరిస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆర్జిత సేవలకు పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతిస్తామన్నారు. తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లపై వైవీ సుబ్బారెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రథసప్తమి వేడుకలను సాంప్రదాయబద్ధంగా గతంలో జరిగినట్లుగానే మాడవీధుల్లో నిర్వహిస్తామన్నారు.

తిరుమలలో కోవిడ్ ఉధృతి తగ్గడంతో భక్తుల రద్దీ అంచెలంచెలుగా పెరుగుతోందన్నారు. అయితే కరోనా వ్యాప్తి తగ్గినప్పటికీ క్యూలైన్లలో కరోనా నిబంధనలు కొనసాగిస్తామని చెప్పారు. చెన్నై టీ. నగర్‌లో ఈ నెల 13న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి కంచి పీఠాధిపతి చేత భూమి పూజ జరుగుతుందన్నారు.

విశాఖపట్నం, అమరావతిలలో శ్రీవారి ఆలయాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. త్వరలోనే మంచి రోజులు చూసుకొని ఆలయాలను ప్రారంభిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.