తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్ల కలకలం

తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్ల కలకలం

Rigging in Tirupati by-election

Tirupati by-election: తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్ల కలకలం ప్రకపంనలు సృష్టిస్తోంది. దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపించిన టీడీపీ నేతలు… జీవకోనలో బయట నుంచి వచ్చి ఓటేస్తోన్న కొంతమందిని టీడీపీ కార్యకర్తలు పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. దీంతో మరోసారి ప్రధాన ఎన్నికల అధికారికి చంద్రబాబు లేఖ రాశారు.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. బయట వ్యక్తులు చొరబడుతున్నారంటూ ఫొటో ఆధారాలతో లేఖ రాశారు. చంద్రగిరి, నగరి, తంబళ్లపల్లె, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో.. వేలాది మంది బయటి వ్యక్తులు ప్రవేశించారని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.

వైసీపీ నేతలు బయటి వ్యక్తులను బస్సుల్లో తరలిస్తున్నారని.. అందుకే తిరుపతిలోకి ప్రవేశించే బస్సులు, వాహనాలను తనిఖీ చేయాలని ప్రధాన ఎన్నికల అధికారికి రాసిన లేఖలో చంద్రబాబు కోరారు. పోలింగ్‌ బూత్‌లోకి టీడీపీ ఏజెంట్లను అనుమతించాలన్నారు. రిగ్గింగ్‌, నకిలీ ఓట్లు వేయకుండా నిరోధించాలని చంద్రబాబు కోరారు.