పెళ్లికి వెళ్లొస్తుండగా యాక్సిడెంట్ : కారును ఢీకొట్టిన రెండు లారీలు.. అక్కడికక్కడే ఇద్దరు మృతి | Road accident Two killed

పెళ్లికి వెళ్లొస్తుండగా యాక్సిడెంట్ : కారును ఢీకొట్టిన రెండు లారీలు.. అక్కడికక్కడే ఇద్దరు మృతి

పెళ్లికి వెళ్లొస్తుండగా యాక్సిడెంట్ :  కారును ఢీకొట్టిన రెండు లారీలు.. అక్కడికక్కడే ఇద్దరు మృతి

Road accident Two killed : ప్రకాశం జిల్లా ఒంగోలు సంఘమిత్ర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మ్యాక్సీ కారు ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేసే సమయంలో ఢీ కొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.తిరుపతిలో బంధువుల పెళ్లికి వెళ్లి స్వగ్రామం తెనాలికి తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. పెళ్లికి వెళ్లి కారులో ప్రయాణిస్తున్న 9 మందిలో నలుగురు క్షేమంగా బయటపడ్డారు. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది. మరికొంతమంది పరిస్థితి సీరియస్ గా ఉంది. క్షతగాత్రులను చికిత్స కోసం సంఘమిత్ర ఆస్పత్రికి తరలించారు.ప్రమాదం జరగగానే రెండు లారీలు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయాయి. తీవ్రంగా గాయడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

×