Tirupati Temple : తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి విఫలయత్నం, రాత్రంతా గుడిలోనే దొంగ

చిత్తూరు జిల్లా తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో చోరీకి విఫలయత్నం జరిగింది. నిన్న(మార్చి 26,2021) రాత్రి గుడి మూసిన తర్వాత లోనికి వెళ్లిన దొంగ హుండీల్లో చోరీకి యత్నించాడు. రెండు హుండీలను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ,

Tirupati Temple : తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి విఫలయత్నం, రాత్రంతా గుడిలోనే దొంగ

Tirupati Temple Robbery

Tirupati Temple Robbery : చిత్తూరు జిల్లా తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో చోరీకి విఫలయత్నం జరిగింది. నిన్న(మార్చి 26,2021) రాత్రి గుడి మూసిన తర్వాత లోనికి వెళ్లిన దొంగ హుండీల్లో చోరీకి యత్నించాడు. రెండు హుండీలను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, దొంగ ప్రయత్నాలు సఫలం కాలేదు. చివరకు ఇవాళ(మార్చి 27,2021) ఉదయం గుడి తలుపులు తెరిచాక భక్తులతో కలిసిపోయి బయటకు పరారయ్యాడు.

నిన్న రాత్రి ఏకాంత సేవ తర్వాత ఆలయంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. రాత్రి 9గంటలకు ఆలయాన్ని మూసివేసి ఉదయాన సుప్రభాత సేవ కోసం అర్చకుడు ఆలయాన్ని తెరిచాడు. ఆలయంలోని హుండీతో పాటు చిందరవందరగా సామాగ్రి పడి ఉండటాన్ని గమనించి షాక్ తిన్నాడు. చోరీ జరిగిందనే అనుమానంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. నిన్న రాత్రంతా దొంగ గుడిలోపలే ఉన్నప్పటికి సెక్యూరిటీ సిబ్బంది గుర్తించలేకపోవడం విమర్శలకు తావిచ్చింది.

నిన్న రాత్రి ఆలయాన్ని మూసివేసిన సమయంలో ఓ వ్యక్తి లోపల ఉండిపోయినట్లు టీటీడీ నిఘా విభాగం అనుమానం వ్యక్తం చేస్తోంది. రాత్రి 9 గంటలకు అధికారులు, భద్రతా సిబ్బంది ఆలయాన్ని మూసివేసిన తర్వాత దొంగతనానికి ప్రయత్నం చేసినట్లు భావిస్తున్నారు. ఆలయంలోని వినాయకుడి విగ్రహం దగ్గర, ధ్వజస్తంభం దగ్గర ఉన్న రెండు హుండీల్లో చోరీకి ప్రయత్నం జరిగింది. గుడిలో అన్ని చోట తాళాలు వేసి ఉండటంతో దొంగ ప్రయత్నం ఫలించ లేదు. ఉదయం ఆలయం తీశాక భక్తుల్లో కలిసిపోయిన దొంగ.. ఆలయం నుంచి బయటకు వెళ్లాడు. సీసీ కెమెరా ఫుటేజ్ లో రికార్డ్ అయిన విజువల్స్ ఆధారంగా దొంగను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.