Ropes of the tent tied to Shivlinga: తూర్పుగోదావరి జిల్లాలో అపచారం.. టెంట్ తాళ్లను శివలింగానికి కట్టిన వైనం

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం బిక్కవోలులో అపచారం జరిగింది. తూర్పు చాళుక్యుల (క్రీ.శ. 624 - 1076) కాలానికి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శివలింగానికి టెంట్ తాళ్లు కట్టారు. మూడో విడత వైఎస్సార్‌ చేయూత పథకం పంపిణీ కోసం ఈ టెంటు వేశారు. టెంట్ తాళ్లను నిర్వాహకులు శివలింగానికి కట్టిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నిర్వాహకులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Ropes of the tent tied to Shivlinga: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం బిక్కవోలులో అపచారం జరిగింది. తూర్పు చాళుక్యుల (క్రీ.శ. 624 – 1076) కాలానికి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శివలింగానికి టెంట్ తాళ్లు కట్టారు. మూడో విడత వైఎస్సార్‌ చేయూత పథకం పంపిణీ కోసం ఈ టెంటు వేశారు.

టెంట్ తాళ్లను నిర్వాహకులు శివలింగానికి కట్టిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నిర్వాహకులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివలింగానికి కట్టిన టెంట్ తాళ్లను నిర్వాహకులు వెంటనే తొలగించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శిలింగానికి కట్టిన టెంట్ తాళ్ల వీడియోలు సామాజిక మాధ్యమాల్లోనూ హల్ చల్ చేస్తుండడంతో నెటిజన్ల నుంచి కూడా నిర్వాహకులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు