Merchant Fraud : చిట్టీల పేరుతో రూ.10 కోట్లకు కుచ్చుటోపి

చిత్తూరు జిల్లా తిరుపతిలో ఘరానా మోసం వెలుగు చూసింది. చిట్టీల వ్యాపారం పేరుతో సుమారు రూ.10 కోట్ల వరకు వసూలు చేసి జెండా ఎత్తేశాడో వ్యాపారి.

10TV Telugu News

Merchant fraud : చిత్తూరు జిల్లా తిరుపతిలో ఘరానా మోసం వెలుగు చూసింది. చిట్టీల వ్యాపారం పేరుతో సుమారు రూ.10 కోట్ల వరకు వసూలు చేసి జెండా ఎత్తేశాడో వ్యాపారి. అరుణ్ కుమార్ అనే వ్యక్తి నగరిలో చిట్టీల వ్యాపారం చేసేవాడు. అనేక మందిని తన వ్యాపారంలోకి దించాడు. నమ్మకంగా ఉంటూనే దాదాపు రూ.10 కోట్ల వసూలు చేసిన వ్యాపారి ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితులంతా అరుణ్ కుమార్ ఇంటికి చేరుకున్నారు. కానీ అప్పటికే అతను పరారు కావడంతో బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు.

కష్టపడి సంపాదించిన డబ్బును దోచుకెళ్లాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు దాదాపు 400 మంది ఉంటారని సమాచారం. వీరిలో సుమారు 100 మంది అరుణ్ కుమార్ ఇంటి చుట్టూ ఉంటారు. నిన్న కూడా అరుణ్ కుమార్ ఇంటి దగ్గర లేరు. ఈ తెల్లవారుజామున భార్యాపిల్లలు కూడా కనిపించకుండా వెళ్లి పోయారు. ఇంటికి తాళం వేసి ఉందని తెలిసి బాధితులంతా అతని ఇంటి వద్దకు వెళ్లారు. బాధితుల్లో చాలా మంది మహిళలు ఉన్నారు.

వీరంతా చట్టు పక్కల ఉన్న ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో పని చేస్తూ అరుణ్ కుమార్ దగ్గర చిట్టీలు వేశారు. దాదాపు 10 వేలు, 20 వేలు, 50 వేలు, లక్షా, 5 లక్షల చిట్టీలు కలిపి మొత్తం నాలుగు వందల మందికి సంబంధించిన రూ.10 కోట్లతో అరుణ్ కుమార్ పరారయ్యారని ప్రాథమిక సమాచారం. ఇప్పటికే నగరి పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. పరారైన అరుణ్ కుమార్ కుటుంబం కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

10TV Telugu News