TTD పాలక మండలి : వెంకన్నను అవమానిస్తే రూ. 100 కోట్ల పరువునష్టం

  • Published By: madhu ,Published On : December 28, 2019 / 10:34 AM IST
TTD పాలక మండలి : వెంకన్నను అవమానిస్తే రూ. 100 కోట్ల పరువునష్టం

తిరుమల తిరుపతి ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులను నియమించేందుకు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ప్రధాన అర్చకులుగా ఉన్న అతను కొనసాగుతారని వెల్లడించారు. దీనిపై ఆలయ అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రమణ దీక్షితులు ఆగమ సలహాదారుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే..శ్రీ వెంకటేశ్వర స్వామిని నింద మోపే విధంగా పబ్లిష్ చేశారని, దీనిపై వంద కోట్ల రూపాయల కింద పరువు నష్టం వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2019, డిసెంబర్ 28వ తేదీ శనివారం టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది.

మీటింగ్ అనంతరం తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి. భక్తుల క్షేమం, భద్రత కోసం రోడ్లపై ఎక్స్ పర్టీ కమిటీ వేయడం జరిగిందని, నివేదిక వచ్చిన అనంతరం పర్మినెంట్‌గా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఉత్సవ మూర్తులపై జరుగుతున్న దానిపై స్పందించారు. ఎలాంటి మార్పు లేదని, ఎలా కార్యక్రమాలు జరుగుతున్నాయో అదే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 

* రెండు ఘాట్ రోడ్ల మరమ్మత్తులకు రూ. 9 కోట్లు కేటాయింపు. 
* టీటీడీ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూర్టీ వింగ్ ఏర్పాటు.
* సోషల్ మీడియాలో టీటీడీపై దుష్ర్పచారాన్ని అరికట్టేందుకు సైబర్ సెక్యూర్టీ. 
* సైబర్ నేరాల విచారణకు డీఎస్పీ స్థాయి అధికారిని నియమించాలని నిర్ణయం.

* వైకుంఠ ఏకాదశి సందర్భంగా వీఐపీలకు గతంలో ఇచ్చిన సమయాన్ని కంటే అరగంట కుదించడం జరిగిందన్నారు. 
* కాణిపాకం వినాయకుని తేరుకు బంగారు తాపడానికి ఆమోదం. 
* టీటీడీలో ఉద్యోగాల భర్తీకి సబ్ కమిటీ వేయడం జరిగిందని, నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం. 
 

* సైబర్ సెక్యూర్టీ విభాగాన్ని టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో కానీ, తిరుమలలో ఏర్పాటు చేయాలని, ఇందుకు సపరేట్‌గా అధికారిని నియమించాలని నిర్ణయం. 
* 2019-20 సంవత్సరానికి శ్రీవారి వార్షిక బడ్జెట్ రూ. 3 వేల 220 కోట్లకు ఆమోదం.
* రూ. 3.4 కోట్లతో తిరుపతిలోని కళ్యాణ మండపాల్లో ఏసీల ఏర్పాటు. 
* రూ. 30 కోట్లతో ముంబైలో శ్రీ వారి ఆలయ నిర్మణానికి టీటీడీ ఆమోదం. 

Read More : బంగారు నాణెలు ఊరికేరావు : అక్షయపాత్ర పేరుతో ఘరానా మోసం