రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బ్లాక్ లో విక్రయం

తిరుమలలో రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బ్లాక్ లో విక్రయించారు. టీటీడీ జూనియర్ అసిస్టెంట్ కిరణ్ సహా ఐదుగురు దళారులను పోలీసులు అరెస్టు చేశారు.

10TV Telugu News

తిరుమలలో రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బ్లాక్ లో విక్రయించారు. టీటీడీ జూనియర్ అసిస్టెంట్ కిరణ్ సహా ఐదుగురు దళారులను పోలీసులు అరెస్టు చేశారు. రూ.5 వేల చొప్పున ఏడుగురికి టిక్కెట్లను దళారులు బ్లాక్ లో విక్రయించారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్దం అక్టోబర్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. టైం స్లాట్ ప్రకారం భక్తులు గోవింద యాప్ లోనే కాక టీటీడీ వెబ్ సైట్ లో కుడా టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది.

TTD : జియో చేతికి ‘తిరుమల’ వెబ్‌సైట్

మరోవైపు రేపటినుంచి రోజుకు 8 వేల చొప్పున సర్వదర్శనం టొకెన్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. సెప్టెంబర్ 26 నుంచి 31 వరకు రోజుకు 8 వేల చొప్పును సర్వదర్శనం టొకెన్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది.

×