Rs.5 lakhs Parla chicken : ఆ కోడి ధర రూ.5లక్షలు : వృత్తి కానిస్టేబుల్… ప్రవృత్తి కోళ్ళ పెంపకం

గార్లదిన్నె మండలం కేశవాపురం గ్రామానికి చెందిన యల్‌.జయచంద్రనాయుడు వృత్తిరీత్యా పోలీస్‌ కానిస్టేబుల్‌. ఒకవైపు విధులు నిర్వహిస్తూనే.. ఖాళీ సమయంలో కోళ్ల పెంపకం చేపడుతున్నారు.

Rs.5 lakhs Parla chicken : ఆ కోడి ధర రూ.5లక్షలు : వృత్తి కానిస్టేబుల్… ప్రవృత్తి కోళ్ళ పెంపకం

Parla Chicken

Rs. 5 lakhs price of the Parla chicken : గార్లదిన్నె మండలం కేశవాపురం గ్రామానికి చెందిన యల్‌.జయచంద్రనాయుడు వృత్తిరీత్యా పోలీస్‌ కానిస్టేబుల్‌. ఒకవైపు విధులు నిర్వహిస్తూనే.. ఖాళీ సమయంలో కోళ్ల పెంపకం చేపడుతున్నారు. స్నేహితుడు ప్రతాప్‌తో కలిసి తమిళనాడు నుంచి పర్లా జాతి రకం కోళ్లను తెచ్చి పోషిస్తున్నారు. సొంతూర్లో ఒక షెడ్డును ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో కోడికి ఒక్కో గూటిని నిర్మించారు. ప్రస్తుతం 30 దాకా కోళ్లను పెంచుతున్నారు. వాటిని పెంచడంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు.

ఉదయాన్నే వాటికి వ్యాయామం చేయిస్తారు. నీటి తొట్టెలో ఈత కొట్టిస్తారు. మిశ్రమ దాణాతోపాటు బాదంపిస్తా, పప్పు, సజ్జలు, జొన్నలు, రాగుల ఆహారాన్ని అందిస్తున్నారు. పోషణలో మెలకువలు పాటించడం ద్వారా శరీరాకృతిలో దృఢత్వం.. ఆహర్యంలో చక్కదనం వస్తుందని జయచంద్రనాయుడు తెలిపారు. కోళ్లకు దాణా కోసం నెలకు సుమారు రూ.10వేల వరకు ఖర్చు పెడుతున్నారు. దాదాపు ఆరు నెలల నుంచి ఏడాదిపాటు వాటిని పెంచి ఆ తర్వాత ఆన్‌లైన్‌లో విక్రయాలు జరుపుతున్నారు. కోడి అందం, బరువును బట్టి ధర పలుకుతుందని ఆయన వివరించారు.

రాజసం ఉట్టిపడేలా.. అందమైన చిలుకలాంటి ముక్కు, పొడవైన తోక ఉండటం పర్లాజాతి కోళ్ల ప్రత్యేకత. మాంసం, పందేల కోసం కాకుండా అందాల పోటీలకు సైతం వీటిని వినియోగిస్తారు. ఈ కోళ్లు పలు రకాల రంగుల్లో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. చిన్నప్పటి నుంచి పక్షులంటే చాలా ఇష్టం. అందుకే నాటుకోళ్ల పెంపకం చేపట్టాను. పర్లా జాతి కోళ్లు అధిక ధర పలుకుతాయని తెలుసుకున్నా.

స్నేహితుడితో కలిసి తమిళనాడులో కొనుగోలు చేసి అన్ని జాగ్రత్తలతో పెంచుతున్నాం. కోళ్ల పెంపకందారులతో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశాం. అందులో కోళ్ల ఫొటోలు ఉంచుతాం. నచ్చినవారు ఫోన్‌ చేసి కొనుగోలు చేస్తుంటారు. పుంజు కోడి ధర రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు పలుకుతోందుందని జయచంద్రనాయుడు అంటున్నారు.