మద్యం షాపు ముందు ఆర్టీసీ బస్సు ఆపిన డ్రైవర్ : ఎందుకో చూసి ప్రయాణికులు షాక్

ఆయన ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్. డ్యూటీలో చాలా బాధ్యతగా ఉండాలి. జాగ్రత్తగా బస్సు నడపాలి. ఎందరో ప్రయాణికుల ప్రాణాలు డ్రైవర్ మీదే ఆధారపడి ఉంటాయి. డ్రైవర్ బండిని జాగ్రత్తగా

  • Published By: veegamteam ,Published On : January 29, 2020 / 12:43 PM IST
మద్యం షాపు ముందు ఆర్టీసీ బస్సు ఆపిన డ్రైవర్ : ఎందుకో చూసి ప్రయాణికులు షాక్

ఆయన ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్. డ్యూటీలో చాలా బాధ్యతగా ఉండాలి. జాగ్రత్తగా బస్సు నడపాలి. ఎందరో ప్రయాణికుల ప్రాణాలు డ్రైవర్ మీదే ఆధారపడి ఉంటాయి. డ్రైవర్ బండిని జాగ్రత్తగా

ఆయన ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్. డ్యూటీలో చాలా బాధ్యతగా ఉండాలి. జాగ్రత్తగా బస్సు నడపాలి. ఎందరో ప్రయాణికుల ప్రాణాలు డ్రైవర్ మీదే ఆధారపడి ఉంటాయి. డ్రైవర్ బండిని జాగ్రత్తగా నడిపితేనే జర్నీ హ్యాపీ అవుతుంది. అయితే ఓ ఆర్డీసీ డ్రైవర్ చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సుని మద్యం షాపు ముందు ఆపాడు. మద్యం షాపులో మందు బాటిల్ కొనుగోలు చేశాడు. ఎలాంటి భయం లేకుండా మందు బాటిల్ తన పక్కన పెట్టుకున్నాడు. ఆర్టీసీ డ్రైవర్ చేసిన పని ఇప్పుడు వివాదానికి దారితీసింది. విమర్శలకు తావిచ్చింది.

ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తోంది. సమయం ఉదయం 10 గంటలు. కోదాడ జాతీయ రహదారిపై డ్రైవర్ సడెన్ గా బస్సుని ఆపాడు. టీ తాగేందుకు ఆపాడేమోనని బస్సులో ఉన్న ప్రయాణికులు అనుకున్నారు. అటు ఇటు చూశారు. కానీ ఎక్కడా టీ కొట్టు కనిపించ లేదు. వైన్ షాప్ మాత్రమే ఉంది. దీంతో వారు కంగుతిన్నారు. పొద్దుపొద్దునే వైన్ షాప్ దగ్గర ఎందుకు ఆపాడని డిస్కస్ చేసుకుంటున్నారు.

బస్సు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో అనుకున్నారు. ఇంతలో డ్రైవర్ పక్కన కూర్చున్న కుర్రాడు.. డ్రైవర్ దగ్గర డబ్బు తీసుకుని కిందకి దిగాడు. రోడ్డు పక్కన ఉన్న శ్రీనిధి వైన్స్ షాప్ కి వెళ్లాడు. అక్కడ Mansion House బ్రాందీ ఫుల్ బాటిల్ కొన్నాడు. ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి డ్రైవర్ కి ఇచ్చాడు. డ్రైవర్ దాన్ని తన వెనుక సీటులో పెట్టాడు. ఇది కళ్లారా చూసిన ప్రయాణికులు షాక్ తిన్నారు.

అమలాపురం డిపోకి చెందిన AP05Z5063 నెంబర్ బస్సు డ్రైవర్ ఈ పని చేశాడు. పొద్దుపొద్దునే ఇలా మద్యం కొనుగోలు చేయడం కలకలం రేపింది. స్థానికులు సెల్ ఫోన్ లో వీడియో తీస్తున్నా.. డ్రైవర్ భయపడలేదు. దీంతో ప్రయాణికులే కాదు.. స్థానికులు కూడా షాక్ అయ్యారు. డ్రైవర్ బాధ్యత లేకుండా ప్రవర్తించాడని ప్రయాణికులు మండిపడ్డారు. డ్యూటీలో ఉండగా.. మరీ ఇంత పబ్లిక్ గా మందు బాటిల్ కొని బస్సులో ఉంచడం నేరం అంటున్నారు. ఇప్పుడు మందు బాటిల్ కొన్న డ్రైవర్.. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడనే గ్యారంటీ ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కొందరు డ్రైవర్ల కారణంగా యాక్సిడెంట్లు అవుతున్నాయని వాపోయారు. బాధ్యత లేకుండా వ్యవహరించిన సదురు డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు అధికారులను డిమాండ్ చేశారు.