ఏపీలో ఆర్టీసీ బస్సులు బంద్

ఏపీలో ఆర్టీసీ బస్సులు బంద్

rtc buses band in ap: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు రేపు(మార్చి 5,2021) ఏపీ బంద్ చేపట్టనున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతోపాటు వామపక్షాలకు చెందిన అన్ని కార్మిక సంఘాలు బంద్ నిర్వహించనున్నాయి. ప్రతిపక్ష టీడీపీ సైతం ఈ బంద్‌కు మద్దతునిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా ఏపీ బంద్‌కు వైసీపీ ప్రభుత్వం సైతం సంఘీభావం ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి పేర్ని నాని తెలిపారు.

రాష్ట్ర బంద్ కు మద్దతుగా మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు బంద్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మధ్యాహ్నం 1గంట తర్వాత బస్సులు తిరుగుతాయని చెప్పారు. నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని ఆర్టీసీ ఉద్యోగులు నిరసన తెలుపుతారన్నారు.

కొన్ని సంస్థలు ప్రభుత్వం చేతిలో ఉంటేనే ధరలు అదుపులో ఉంటాయని మంత్రి తేల్చి చెప్పారు. అందుకే ఆర్టీసీని ప్రజల ఆస్తిగా ఉంచామన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆర్టీసీని అప్పుల నుంచి బయటపడేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. అలాగే కేంద్రం కూడా స్టీల్ ప్లాంట్‌ను అప్పుల నుంచి బయట పడేసేందుకు ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని మంత్రి పేర్ని నాని సూచించారు.