ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు, సోమవారం కీలక సమావేశం

  • Published By: madhu ,Published On : September 12, 2020 / 12:44 PM IST
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు, సోమవారం కీలక సమావేశం

AP & TS RTC : తెలుగు రాష్ట్రాల మధ్య నెలలుగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అధికారుల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రవాణా శాఖ మంత్రులు అజయ్, పేర్ని నానిలు స్వయంగా భేటీ కానున్నారు.



https://10tv.in/most-secure-way-to-lock-your-smartphone-answer-will-surprise-you/
2020, సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం నాడు జరిగే ఈ సమావేశంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. బస్సులు తిప్పేందుకు నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. దీంతో సోమవారం నుంచి బస్సులు రోడ్డెక్కనున్నాయని తెలుస్తోంది.



కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన తర్వాత..సాధారణ జీవనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ లాక్ కొనసాగుతోంది. వివిధ రంగాలకు కొన్ని నిబంధనలతో అనుమతులు మంజూరు చేస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆర్టీసీ బస్సులు ప్రారంభం కాలేదు. తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ గవర్నమెంట్ లేఖ కూడా రాసింది. బస్సుల రూట్లను కుదించాలని, అంతర్ రాష్ట్ర ఒప్పందం కోసం చర్చలకైనా సిద్ధమని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.