Employees: ఉద్యోగుల సమ్మెకు సపోర్ట్ చేయట్లేదు -ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం

ఏపీలో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పీఆర్సీ పంచాయితీ ఇప్పుడు రోడ్డెక్కుతోంది.

Employees: ఉద్యోగుల సమ్మెకు సపోర్ట్ చేయట్లేదు -ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం

Rtc Bus

SC, ST RTC Employees: ఏపీలో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పీఆర్సీ పంచాయితీ ఇప్పుడు రోడ్డెక్కుతోంది. ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టి “ఛలో విజయవాడ” అంటూ సమ్మెకు దిగాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసులు అందజేసిన ఉద్యోగ సంఘాలతో మంత్రులు కూడా చర్చలు నిర్వహించారు. ఈ చర్చల్లో సయోధ్య కుదరకపోవడంతో సమ్మెకు దిగుతున్నారు.

ఈ సమ్మెకు ఏపీఎస్ ఆర్టీసీ కూడా సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించగా.. ఈ సమ్మెలో పాల్గొనట్లేదని ప్రకటించారు ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం. సమ్మెలో పాల్గొనట్లేదంటూ సజ్జలకు లేఖ ఇచ్చారు సంఘం నేతలు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సీఎం జగన్ మాకు మంచి చేశారని, కరోనా సమయంలో ఆరు నెలలు ఇంట్లో ఉన్నా జీతాలు ఇచ్చారని చెబుతున్నారు ఆ సంఘం నేతలు.

ఇటువంటి మంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాల్లో మేం పాల్గొనమని అన్నారు సంఘం నేతలు.

ఉద్యోగుల డిమాండ్స్‌లో మాకు సంబంధించినవి ఒక్కటీ లేదని, మేం 13వేల మందిమి ఉన్నామని, ఎవరూ ఈ సమ్మెలో పాల్గొనట్లేదని చెప్పారు.