RUIA Hospital : రుయాలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి – కలెక్టర్

రుయా ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను కలెక్టర్ హరినారాయణ పరిశీలించారు. ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయారని వెల్లడించారు.

RUIA Hospital : రుయాలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి – కలెక్టర్

Ruya Hospital

Oxygen Supply Delay : ఒక్క క్షణం ఆక్సిజన్ అందకపోతే..ఎలా ఉంటుంది. అదే జరిగింది ప్రఖ్యాత రుయా ఆసుపత్రిలో. తిరుపతిలో ఉన్న రుయా ఆసుపత్రిలో 2021, మే 10వ తేదీ సాయంత్రం ఆక్సిజన్ అందక పలువురు ప్రాణాలు పోయాయనే వార్త తీవ్ర కలకలం రేపింది. దీనిపై కలెక్టర్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను కలెక్టర్ హరినారాయణ పరిశీలించారు. ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయారని వెల్లడించారు. ఐదు నిమిషాలు ఆక్సిజన్ అందకపోవడంతో చనిపోయారని, ఆసుపత్రిలో ఉన్న మరికొందరి పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. మిగిలిన వారిని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారని, దాదాపు వెయ్యి మందికి చికిత్స జరుగుతోందన్నారు. తమిళనాడు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంగా వచ్చిందని, ఆక్సిజన్ ఆలస్యం కావడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. మృతదేహాలను ప్లాస్టిక్ కవర్ లో చుడుతున్నారు రుయా సిబ్బంది.

ఆక్సిజన్..ఆక్సిజన్..ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే మాట. ఆక్సిజన్ అందక పలువురు కరోనా రోగులు చనిపోతున్నారు. ఆక్సిజన్ అందక నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కరోనా వైరస్ కారణంగా రోగులు ప్రాణవాయువు కోసం అల్లాడిపోతున్నారు. పలు ఆసుపత్రుల్లో వెంటిలెటర్లు, ఆక్సిజన్ బెడ్స్ పై చికిత్స పొందుతున్నారు.