Sabbam Hari : కరోనా సోకిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఆరోగ్య పరిస్థితి విషమం

టీడీపీ సీనియర్ నేత, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా మారింది. కరోనా బారిన పడిన ఆయన... విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 5 రోజులుగా చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌తోపాటు ఇతర ఇన్ఫెక్షన్లు సోకడంతో ఆయన ఆరోగ్యం విషమించిందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.

Sabbam Hari : కరోనా సోకిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఆరోగ్య పరిస్థితి విషమం

Sabbam Hari

Sabbam Hari : టీడీపీ సీనియర్ నేత, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా మారింది. కరోనా బారిన పడిన ఆయన… విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 5 రోజులుగా చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌తోపాటు ఇతర ఇన్ఫెక్షన్లు సోకడంతో ఆయన ఆరోగ్యం విషమించిందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.

సబ్బం హరికి ఏప్రిల్ 15న కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. డాక్టర్ల సూచనల మేరకు మూడు రోజులు హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. అప్పటికీ కోలుకోకపోవడంతో ఆస్పత్రిలో చేరారు. గత మూడు రోజులుగా వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆదివారం(ఏప్రిల్ 25,2021) ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉందని ఆస్పత్రి వైద్య వర్గాలు తెలిపాయి. దీంతో అనుచరులు, అభిమానులు, కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు. సబ్బం హరి విశాఖపట్నం మేయర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో సబ్బం హరి ఒకరు.

ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12వేల 634 కరోనా కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజులు 11వేల మార్క్‌ని దాటిన కేసులు 12వేల మార్క్‌ని దాటాయి. మరో 69 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 10,33,560కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7వేల 685కి చేరింది.