Sachivalaya Udyogulu: సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు

గ్రామ సచివాలయాలతో పాటు వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారుపై స్టేట్ గవర్నమెంట్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని డిపార్ట్‌మెంటల్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి జూన్ నెలాఖరులోగా ప్రొబేషన్‌ ఖరారు చేయాలని కలెక్టర్లకు అధికారాలు ఇచ్చింది.

Sachivalaya Udyogulu: సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు

Sachivalayam Employees

Sachivalaya Udyogulu: గ్రామ సచివాలయాలతో పాటు వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారుపై స్టేట్ గవర్నమెంట్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని డిపార్ట్‌మెంటల్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి జూన్ నెలాఖరులోగా ప్రొబేషన్‌ ఖరారు చేయాలని కలెక్టర్లకు అధికారాలు ఇచ్చింది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-5, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ కార్యదర్శుల మూలవేతనం రూ.23వేల 120 నుంచి ప్రారంభమవుతుంది. మిగతా ఉద్యోగుల మూలవేతనం రూ.22వేల 460 నుంచి మొదలవుతుంది. వీటితో పాటుగా కరవుభత్యం, అద్దె భత్యం అదనంగా కలవనున్నాయి.

2022 పీఆర్సీ ప్రకారం జులై నెల నుంచి వర్తింపజేస్తున్న క్రమంలో ఉద్యోగులకు ఆగష్టులో ఈ వేతనాలు అందనున్నాయి. రాష్ట్రంలో 2019 అక్టోబరులో ప్రారంభమైన 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం 1.21 లక్షల మంది ఉద్యోగులను నియమించింది. 2019-20, 2020-21లో రెండు విడతల్లో నియామక ప్రక్రియ పూర్తి చేశారు.

గ్రామ సచివాలయాల్లో 11 మంది, వార్డు సచివాలయాల్లో 8 మంది చొప్పున సిబ్బందిని నియమించారు. వీరికి ఇప్పటివరకు నెలకు రూ.15 వేల చొప్పున చెల్లిస్తున్నారు. రెండేళ్ల సర్వీసు పూర్తయి శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఉద్యోగులకు 2021 అక్టోబరు నాటికే ప్రొబేషన్‌ ఖరారు చేసి కొత్త వేతనాలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన.. ఎనిమిది నెలలు ఆలస్యంగా తాజా జీవో వెలువడింది.

Read Also : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్

ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారు చేసేదెవరు

కలెక్టర్‌: పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-5, డిజిటల్‌ అసిస్టెంట్‌ (పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-6), ఎనర్జీ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, హార్టికల్చర్‌ అసిస్టెంట్‌, వెటర్నరీ, ఫిషరీస్‌ అసిస్టెంట్‌, గ్రామ మహిళా పోలీస్‌, గ్రామ రెవెన్యూ అధికారి (గ్రేడ్‌-2), వార్డు రెవెన్యూ కార్యదర్శి, వార్డు మహిళా పోలీస్‌
సర్వే సహాయ సంచాలకులు: గ్రామ సర్వేయర్‌ (గ్రేడ్‌-3)
వ్యవసాయ సంచాలకులు: అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌
జిల్లా పట్టుపరిశ్రమ అధికారి: సెరికల్చర్‌ అసిస్టెంట్‌
విద్యుత్తు పంపిణీ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌: గ్రామ, వార్డు ఎనర్జీ అసిస్టెంట్‌
వైద్య, ఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకులు: ఏఎన్‌ఎం, వార్డు హెల్త్‌ కార్యదర్శి
పురపాలక ప్రాంతీయ సంచాలకులు: వార్డు పరిపాలన కార్యదర్శి, వార్డు శానిటేషన్‌, పర్యావరణ కార్యదర్శి, విద్యా, డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి, సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి (గ్రేడ్‌-2)
ప్రజారోగ్య పర్యవేక్షక ఇంజినీర్‌ (ఎస్‌ఈ): వార్డు ఎమినిటీస్‌ కార్యదర్శి (గ్రేడ్‌-2)
పట్టణ ప్రణాళిక ప్రాంతీయ ఉప సంచాలకులు: వార్డు ప్లానింగ్‌, రెగ్యులేషన్‌ కార్యదర్శి.