Sadist Husband : కట్నంగా రూ.20లక్షల క్యాష్, బంగారం.. అయినా తప్పని వేధింపులు, విజయవాడలో శాడిస్ట్ భర్త

ఆస్తులు ఉన్నాయని నమ్మించాడు. భార్యకు ఏ లోటు రాకుండా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని హామీ ఇచ్చాడు. కానీ, పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచే వేధింపులు మొదలు పెట్టాడు. చివరికి తల్లిదండ్రులతో కలిసి భార్యను కొట్టి ఆసుపత్రిలో పడేసి వెళ్లిపోయాడో శాడిస్ట్ భర్త. విజయవాడలో ఈ ఘటన వెలుగుచూసింది.

Sadist Husband : కట్నంగా రూ.20లక్షల క్యాష్, బంగారం.. అయినా తప్పని వేధింపులు, విజయవాడలో శాడిస్ట్ భర్త

Sadist Husband : ఆస్తులు ఉన్నాయని నమ్మించాడు. భార్యకు ఏ లోటు రాకుండా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని హామీ ఇచ్చాడు. కానీ, పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచే వేధింపులు మొదలు పెట్టాడు. చివరికి తల్లిదండ్రులతో కలిసి భార్యను కొట్టి ఆసుపత్రిలో పడేసి వెళ్లిపోయాడో శాడిస్ట్ భర్త. విజయవాడలో ఈ ఘటన వెలుగుచూసింది.

తెలంగాణలోని డోర్నకల్ కు చెందిన యువతిని ఏపీలోని నంద్యాలకు చెందిన మహబూబ్ షరీఫ్ పెళ్లి చేసుకున్నాడు. ఓ ప్రభుత్వ రంగ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్న షరీఫ్.. తమకు బాగా ఆస్తులు ఉన్నాయని చెప్పి మధ్యవర్తి ద్వారా యువతి కుటుంబసభ్యులను ఒప్పించి 2021 జూలై 5న పెళ్లి చేసుకున్నాడు.

Also Read..Bengaluru Incident : బాబోయ్.. వీడియో కాల్‌లో భార్యను చూపించలేదని సహోద్యోగిపై కత్తెరతో దాడి

20లక్షల కట్నంతో పాటు బంగారం, ఇల్లు ఇచ్చారు. కానీ, అత్త వారింట్లో అడుగు పెట్టిన మొదటి రోజే భార్యకు వేధింపులు మొదలయ్యాయి. పెళ్లి ఘనంగా చేయలేదని వేధించారని బాధితురాలు ఆరోపించింది.

”మాకు ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి ఓ బ్రోకర్ ద్వారా మా పేరెంట్స్ దగ్గరికి వచ్చారు. పెళ్లి సంబంధం చూసినందుకు బ్రోకర్ కి కూడా 4లక్షలు ఇచ్చాం. మ్యారేజ్ మధ్యాహ్నం అయ్యింది. ఆ రోజు రాత్రి నుంచే వేధింపులు స్టార్ట్ అయ్యాయి. మీరు సరిగా మర్యాదలు చేయలేదు. అది లేదు, ఇది లేదు అని గొడవకు దిగారు. మ్యారేజ్ అయిన 3వ రోజుకి మాకు నిజం తెలిసింది. అబ్బాయి వాళ్లకు ఎలాంటి ప్రాపర్టీస్ లేవు. పెళ్లి, రిసెప్షన్ అన్నీ మా ఇంట్లోనే చేశారు. పెళ్లి తర్వాత నన్ను తీసుకెళ్తారని వెయిట్ చేశాను. కానీ, వాళ్లకు ఏమీ లేదు. నన్ను ఎక్కడికీ తీసుకెళ్లరని నాకు తెలిసింది” అని బాధితురాలు వాపోయింది.

Also Read..Suicide In Railway Station : షాకింగ్ వీడియో.. ఏం కష్టం వచ్చిందో.. అంతా చూస్తుండగానే రైలు కిందకి దూకి రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

యువతి భర్త కొంతకాలం చెన్నైలో పని చేశాడు. అతడు అక్కడే ఉన్నా వేధింపులు తప్పలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత బదిలీపై విజయవాడ వచ్చాక వేధింపులు మరింత పెరిగాయని యువతి చెప్పింది. డబ్బు కోసం తనను చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించింది. ”పెళ్లి అయిన ఏడాదిన్నర కాలంలో చాలాసార్లు కొట్టారు. ఇంటికి పంపుతామని బ్లాక్ మెయిల్ చేశారు. ఇంటికెళ్లి అది తీసుకురా ఇది తీసుకురా అని వేధించారు. కారు కావాలని టార్చర్ పెట్టారు. బిల్డింగ్ కావాలన్నారు. నేను ఒక్క కూతురినే కావడంతో డబ్బు, బంగారం, ఇల్లు, స్థలం అన్నీ ఇచ్చారు” అయినా అదనపు కట్నం కోసం వేధింపులు తప్పలేదు అని యువతి వాపోయింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

గతేడాది అక్టోబర్ 21న కూడా భర్త, అత్తమామలు కొట్టి ఆసుపత్రిలో వదిలేసి వెళ్లారని కన్నీటిపర్యంతం అయ్యిందా యువతి. ఏడాదిన్నరలో వేధింపుల కారణంగా తనకు రెండుసార్లు అబార్షన్ అయ్యిందని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని పటమట పోలీసులను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయిందని యువతి చెప్పింది.