Sajjala On Tenth Results : గతంలో కార్పొరేట్ సంస్థల అక్రమాలతో ఎక్కువ ఫలితాలు వచ్చేవి- టెన్త్ ఫలితాలపై సజ్జల

సీరియస్‌గా పరీక్షలు ఎలా నిర్వహించాలో అలాగే నిర్వహించడం కూడా ఎక్కువమంది పాస్ కాకపోవడానికి కారణం. కొవిడ్ కూడా కొంత ప్రభావం చూపించింది.(Sajjala On Tenth Results)

Sajjala On Tenth Results : గతంలో కార్పొరేట్ సంస్థల అక్రమాలతో ఎక్కువ ఫలితాలు వచ్చేవి- టెన్త్ ఫలితాలపై సజ్జల

Sajjala On Tenth Results

Sajjala On Tenth Results : ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. 67.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 6లక్షల 15వేల 908 మంది పరీక్షలకు హాజరవగా.. 4లక్షల 14వేల 281 మంది పాస్ అయ్యారు. ఫలితాల్లో బాలికలదే పైచేయి. ఉత్తీర్ణత శాతంలో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో ఉండగా, అనంతపురం చివరి స్థానంలో నిలిచింది. 797 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్‌ కాకపోవడం గమనార్హం.

కాగా, టెన్త్ ఫలితాల్లో 2లక్షల మందికిపైగా విద్యార్థులు ఫెయిల్ కావడం, ఉత్తీర్ణత శాతం గణనీయంగా తగ్గడం విస్మయానికి గురి చేసింది. ఉమ్మడి ఏపీలో 2002లో 66.06శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈసారి 67.26శాతం నమోదైంది. గత 20 ఏళ్లలో అతి తక్కువగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. దీన్ని విపక్షాలు తమ అస్త్రంగా చేసుకున్నాయి. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నాయి.(Sajjala On Tenth Results)

SSC Exam Results: పదో తరగతి పరీక్షా ఫలితాలపై రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయాలంటే..

ఇది ప్రభుత్వ పాపమే అని టీడీపీ ఆరోపిస్తోంది. టీచర్లకు వైన్ షాపుల దగ్గర డ్యూటీ వేసే శ్రద్ధ విద్యపై ప్రభుత్వం పెట్టలేదని, ఒక్క డీఎస్సీ కూడా లేకపోవడంతో స్కూళ్లలో టీచర్ల కొరత ఏర్పడిందని నారా లోకేశ్ అన్నారు. అమ్మఒడి, సంక్షేమ పథకాలకు విద్యార్థులను తగ్గించే కుట్ర జరిగిందని ఆరోపించారు. ఇది టెన్త్ స్టూడెంట్స్ ఫెయిల్ కాదని, జగన్ సర్కార్ ఫెయిల్ అని ఫైర్ అయ్యారు.(Sajjala On Tenth Results)

టెన్త్ ఫలితాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. విపక్షాల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. టెన్త్ ఫలితాలపై తలకాయ లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోవిడ్ కారణంగా రెండేళ్లు క్లాసులు లేకపోవడంతో పాస్ శాతం తగ్గిందని సజ్జల వివరించారు. అమ్మఒడికి, టెన్త్ ఫలితాలకు సంబంధమే లేదని స్పష్టం చేశారు. గతంలో కార్పొరేట్ సంస్థల అక్రమాలతో ఎక్కువ ఫలితాలు వచ్చేవని సజ్జల ఆరోపించారు. ఈసారి అక్రమాలు జరగకుండా అడ్డుకున్నాం అన్నారు. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చామని తెలిపారు.

AP 10th Results: ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల.. 67 శాతం ఉత్తీర్ణత

‘పదో తరగతి ఫలితాలపై ప్రతిపక్షాల విమర్శలు సరికాదు. నారాయణ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఫలితాల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. సీరియస్‌గా పరీక్షలు ఎలా నిర్వహించాలో అలాగే నిర్వహించడం కూడా ఎక్కువమంది పాస్ కాకపోవడానికి కారణం. కొవిడ్ కూడా కొంత ప్రభావం చూపించింది. టీడీపీ దేన్ని తప్పుబడుతుందో అర్థం కావడం లేదు. పరీక్షలు ఉండాలా? వద్దా? లేకపోతే పదో తరగతి కూడా అందరినీ పాస్ చేసి పంపించేయాలా? నారాయణ, చైతన్య వంటి విద్యాసంస్థలు టీడీపీ హయాంలో ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తూ వచ్చాయి. అందుకే 90కి పైగా ఉత్తీర్ణత సాధారణంగా కనిపించింది. కాపీ కొట్టడానికి అవకాశం ఉండే బిట్ పేపర్ తీసేయటం కూడా పాస్ పర్సంటేజ్ తగ్గడానికి ఒక కారణం అని చెప్పవచ్చు” అని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.(Sajjala On Tenth Results)