Sajjala : వేతనం పెరుగుతుంది.. పీఆర్సీకి మరికొంత సమయం పట్టొచ్చు-సజ్జల

సీఎం ఆదేశాల మేరకు మళ్లీ కసరత్తు చేస్తున్నామని తెలిపారు. పీఆర్సీతో బడ్జెట్ పై పడే భారాన్ని అంచనా వేస్తున్నామని, ఈ క్రమంలో పీఆర్సీ నివేదికలో స్వల్ప సవరణలు చేస్తున్నారని చెప్పారు.

Sajjala : వేతనం పెరుగుతుంది.. పీఆర్సీకి మరికొంత సమయం పట్టొచ్చు-సజ్జల

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy : పీఆర్సీ ప్రకటనకు మరికొంత సమయం పట్టొచ్చని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు మళ్లీ కసరత్తు చేస్తున్నామని తెలిపారు. పీఆర్సీతో బడ్జెట్ పై పడే భారాన్ని అంచనా వేస్తున్నామని, ఈ క్రమంలో పీఆర్సీ నివేదికలో స్వల్ప సవరణలు చేస్తున్నారని ఆయన చెప్పారు. పీఆర్సీ భారం అంచనా వల్లే ప్రక్రియ ఆలస్యమైందని వెల్లడించారు.

మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని సీఎం ఆదేశించారన్న సజ్జల, ఉద్యోగులు అసంతృప్తి చెందకూడదన్నదే సీఎం ఉద్దేశం అని తెలిపారు. రేపటి నుంచి పీఆర్సీ ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. ఉద్యోగులకు ఫిట్ మెంట్ పెంచడమే లక్ష్యంగా కసరత్తు జరుగుతోందని సజ్జల వివరించారు.

Vaccination Of Children : సరైన శిక్షణ పొందిన వారితో మాత్రమే పిల్లలకు కోవిడ్ టీకాలు వేయించాలి : కేంద్ర ఆరోగ్యశాఖ

సీఎంతో సమావేశం అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. ”పీఆర్‌సీ నివేదికలో స్వల్ప సవరణలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ రేపట్నుంచి వేగవంతం అవుతుంది. మెరుగైన పీఆర్‌సీ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగులు అసంతృప్తి చెందకూడదన్నదే సీఎం ఉద్దేశం. ఫిట్‌మెంట్‌ పెంచడమే లక్ష్యంగా కసరత్తు జరుగుతోంది. బడ్జెట్‌పై పడే పీఆర్‌సీ భారం అంచనా వేస్తున్నాం. పీఆర్‌సీ భారం అంచనా వల్లే ప్రక్రియ ఆలస్యమవుతోంది. ప్రస్తుతం కంటే తప్పకుండా వేతనం పెరుగుదల ఉంటుంది. ఉద్యోగ సంఘాలతో త్వరలో సీఎం జగన్‌ చర్చలుంటాయి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీని ఫైనల్ చేసేందుకు ఏపీ సర్కార్ సమాలోచనలు చేస్తోంది. పీఆర్సీపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల డిమాండ్లు ఏంటన్న విషయంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. సీఎస్ స‌మీర్ శ‌ర్మ, ఆర్థిక‌, సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ముఖ్య కార్యద‌ర్శులను అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. ఉద్యోగులకు ఎంత మేర ఫిట్‌మెంట్ ఇవ్వాలన్న దానిపై చర్చించారు.

Oppo A11s : భారీ బ్యాటరీతో ఒప్పో నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్..!

14.29 శాత‌ం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ఇటీవలే ప్రభుత్వానికి సీఎస్ కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. మధ్యంతర భృతి కన్నా తక్కువ పీఆర్సీ ఇస్తే జీతాలు తగ్గిపోతాయంటూ ఆందోళన వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. త్వరలో ఉద్యోగ సంఘాల‌తో సీఎం జ‌గ‌న్‌ సమావేశం కానున్నారు. పీఆర్సీ సహా ఇతర డిమాండ్ల పరిష్కారంపై చర్చించనున్నారు. ఫిట్‌మెంట్‌పై ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు సీఎం జగన్.