Badvel : పవన్‌ ఫిలిం ఇండస్ట్రీకి గుదిబండ : సజ్జల

ప్రతిపక్షాలు పోటీ పెడతాయా లేదా మిగతా పార్టీల ఇష్టం. పోటీ పెట్టకపోతే సంతోషం. పెట్టినా మాకు ఇబ్బంది లేదు. 

10TV Telugu News

Badvel – Pawan Kalyan: బద్వేల్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది.  అక్టోబర్ 30న పోలింగ్.. నవంబర్ 2న కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికలో పోటీపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మరోవైపు… పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన కామెంట్స్ పైనా ఆయన రియాక్టయ్యారు.

“పవన్ ఇండస్ట్రీకి పెద్ద గుదిబండ అని సినీ పెద్దలు భావిస్తున్నారు. ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను ఇండస్ట్రీలో అందరూ కోరుకుంటున్నారు. ఈ వ్యవస్థని ప్రొడ్యూసర్లు, డిస్టిబ్యూటర్లు ప్రధానంగా కోరుతున్నారు. వినోదం పేరుతో దోపిడీ లేకుండా తక్కువ ఖర్చుతో ప్రజలకు అందాలనేదే మా విధానం. ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలతో అందరికీ మంచి జరుగుతుంది. కచ్చితంగా ఈ నిర్ణయంపై ముందుకు వెళ్తాం. సినీ పెద్దలు అంగీకరించారు. ఏవిధంగా తీసుకురావాలని అనే దానిపై టెక్నికల్ గా ప్రాసెస్ నడుస్తుంది. త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. సినీ పెద్దలు సీఎం జగన్ తో మాట్లాడలంటే ఎప్పుడైనా రావొచ్చు. సీఎం జగన్ అందరినీ కలుస్తున్నారు.. అలానే సినిమా వాళ్ళు వస్తే వాళ్ళని కలుస్తారు.. సమస్యలు ఉంటే వింటారు.. పరిష్కరిస్తారు” అని చెప్పారు సజ్జల.

Pawan Kalyan : సినీ ప‌రిశ్ర‌మ‌కు ఇబ్బందులు క‌లిగిస్తే తాట తీస్తా – పవన్ కళ్యాణ్ ఘాటు హెచ్చరిక

బద్వేల్ అభ్యర్థిగా సుబ్బయ్య భార్య సుధని సీఎం జగన్ ఎంపిక చేశారనీ.. చనిపోయిన వారి కుటుంబానికే తాము మొదటి ఛాన్స్ ఇచ్చామని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి. “చనిపోయిన వారి కుటుంబానికి ఎన్నిక లేకుండా ఇవ్వడం ఆనవాయితీ. ప్రతిపక్షాలు పోటీ పెడతాయా లేదా మిగతా పార్టీల ఇష్టం. పోటీ పెట్టకపోతే సంతోషం. పెట్టినా మాకు ఇబ్బంది లేదు. ఫలితాల్లో గతంలో కంటే మాకు మంచి మెజార్టీ వస్తుంది. మూడు నాలుగు రోజుల్లో నేతలతో సీఎం చర్చించి కార్యాచరణ రూపొందిస్తారు. పారదర్శకంగా ఎన్నికలు జరిగే విధంగా చూస్తాం. రిఫరెండం అని ఏమీ అనుకోవడం లేదు.. ప్రజల మద్దతు మాకు ఉంటుంది” అని ధీమా వ్యక్తంచేశారు సజ్జల.

 

10TV Telugu News