Sajjala : ఆ జీవోలు మినహా.. మిగతా మార్పుల గురించి మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధం | Sajjala Ramakrishna Reddy On PRC Issue

Sajjala : ఆ జీవోలు మినహా.. మిగతా మార్పుల గురించి మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధం

పీఆర్సీ జీవోలు నిలుపుదల చేయాలని ఉద్యోగా సంఘాల నేతలు కోరారని.. అయితే, ఒక్కసారి జారీ చేసిన జీవోలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం సమంజసం కాదన్నారు సజ్జల.

Sajjala : ఆ జీవోలు మినహా.. మిగతా మార్పుల గురించి మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధం

Sajjala : ఏపీలో పీఆర్సీ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ విషయంలో ప్రభుత్వం పట్టు వీడటం లేదు. ఉద్యోగ సంఘాలు బెట్టు దిగడం లేదు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు మళ్లీ వాయిదా పడ్డాయి.

Night Food : రాత్రి సమయంలో ఆ ఆహారం తింటే షుగర్ , గుండె జబ్బులు వచ్చే చాన్స్!..

నిన్నటిలాగే మంత్రుల కమిటీ నేడు కూడా ఉద్యోగుల కోసం ఎదురు చూసిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఆలస్యంగా వచ్చినా వేచి చూశామన్నారు. స్టీరింగ్‌ కమిటీ నేతలు వచ్చి తమను కలిశారని తెలిపారు. పీఆర్సీ జీవోలు నిలుపుదల చేయాలని కోరారని చెప్పారు. అయితే, ఒకసారి జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయడం సమంజసం కాదన్నారు సజ్జల.

Sanitizers : శానిటైజర్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు.. ముఖ్యంగా మహిళలు, పిల్లలు..

ఏదీ అడక్కుండానే ముఖ్యమంత్రి జగన్ అన్నీ ఇచ్చారని చెప్పారు. ఇంతకాలం చేసిన ప్రక్రియను తిరగతోడటం సరికాదని ప్రభుత్వం అప్పీల్ చేస్తోందన్నారు. ఏవైనా మార్పులు ఉంటే వాటి గురించి మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సజ్జల స్పష్టం చేశారు. మళ్లీ 27వ తేదీన చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను కోరామని సజ్జల తెలిపారు.

ఏపీలో సమ్మె సైరన్ మోగిన సంగతి తెలిసిందే. పీఆర్సీ అంశంపై ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. రాష్ట్ర జీఏడీ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు ఉద్యోగ సంఘాల నేతలు నోటీసును ఇచ్చారు. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్టు నోటీసులో తెలిపారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని సమ్మె నోటీసులో డిమాండ్ చేశారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకునేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

×