Sajjala PRC : ముందు చర్చలకు రండి.. తర్వాత మిగతా అంశాలు మాట్లాడదాం- సజ్జల

పీఆర్సీపై ఏవైనా సందేహాలు ఉంటే ఉద్యోగులు కమిటీని అడగొచ్చు. చర్చలు, కమిటీపై అపోహలు వీడాలి. రేపు కూడా వారితో చర్చలకు వేచి చూస్తాం.

Sajjala PRC : ముందు చర్చలకు రండి.. తర్వాత మిగతా అంశాలు మాట్లాడదాం- సజ్జల

Sajjala Prc

Sajjala PRC : ఉద్యోగులతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పీఆర్సీపై ఏవైనా సందేహాలు ఉంటే ఉద్యోగులు కమిటీని అడగొచ్చని ఆయన చెప్పారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే అని సజ్జల స్పష్టం చేశారు. చర్చలు, కమిటీపై అపోహలు వీడాలని సజ్జల కోరారు. పీఆర్సీపై ప్రభుత్వ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వస్తే ప్రభుత్వ నిర్ణయాన్ని నచ్చజెప్పే ప్రయత్నంలో భాగంగానే కమిటీ ఏర్పాటైందని సజ్జల వివరించారు. పీఆర్సీ జీవోలు నిలుపుదల చేయాలని సంఘాలు కోరాయని.. ముందుగా చర్చలకు వస్తేనే మిగతా అంశాల గురించి మాట్లాడగలమన్నారు. కమిటీని అధికారికంగా ప్రకటించే వరకు వచ్చేది లేదని చెప్పారని.. రేపు కూడా వారితో చర్చలకు వేచి చూస్తామని, మరోసారి ఉద్యోగ సంఘాల నేతలకు సమాచారం అందిస్తామన్నారు. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కార్యదర్శి ఫోన్‌ చేసిన చెప్పిన తర్వాత కూడా.. అధికారిక కమిటీ కాదని ఎలా అంటారని సజ్జల ప్రశ్నించారు.

Andhra Pradesh PRC : పీఆర్సీ పిటిషన్.. నిర్ణయం తీసుకునే అధికారం మాకు లేదు

ఈ కమిటీ.. ఉద్యోగులను బుజ్జగించడంతో పాటు చిన్న చిన్న ఇష్యూస్ ను పరిధి లో ఉంటే పరిస్కారనికి కృషి చేస్తుందన్నారు. ట్రెజరీ ఉద్యోగుల చర్యలతో నోటీస్‌ పీరియడ్‌కు అర్థం ఉండదని.. అలా చేస్తే క్రమశిక్షణలో ఉంచే ప్రక్రియ ప్రారంభమవుతుందని సజ్జల హెచ్చరించారు. సమ్మె విషయంలో ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేశారు సజ్జల. సమ్మె నోటీసు ఇచ్చినా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామన్నారు. ఉద్యోగుల విషయంలో ఏమేం చేశామో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చెబుతుంది, అందులో తప్పులేదన్నారు సజ్జల.

Govt Employees Strike : సమ్మెకు వెళితే చర్యలు.. భయపడేది లేదన్న ఉద్యోగ సంఘాలు

ఉద్యోగులను కొన్ని వర్గాలు వాడుకుంటున్నాయని, కానీ ప్రభుత్వానికి ఉద్యోగులపై ఎలాంటి ద్వేషం లేదని సజ్జల అన్నారు. ఎక్కడో ఉండి ప్రకటనలు ఇవ్వడం కంటే, తమ దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పుకుంటే సమంజసంగా ఉంటుందని హితవు పలికారు. పీఆర్సీ చాలదని ఉద్యోగులు అంటున్నారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతమేరకు మంచి చేశామో తాము చెబుతున్నామన్నారు. అలా కాకుండా ప్రభుత్వ కమిటీని గుర్తించబోమని ఉద్యోగులు పేర్కొనడం ప్రతిష్టంభనను మరింత పెంచడమే అన్నారు.