Sajjala Ramakrishna Reddy: విజయసాయిరెడ్డికి ఒక్కరే కూతురు ఉన్నారు.. అరెస్టు అయ్యింది ఆయన అల్లుడు కాదు: సజ్జల

 విజయసాయిరెడ్డికి ఒకరే కూతురు ఉన్నారని, అరెస్టు అయ్యింది ఆయన అల్లుడు కాదని, ఆయన అల్లుడి సోదరుడని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. అరబిందో అనేది పెద్ద వ్యాపార సంస్థ అని చెప్పారు. వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న అంతర్జాతీయ వ్యాపార సంస్థ అని అన్నారు. విజయసాయిరెడ్డి వాళ్ళకి బంధువే కానీ.. వాళ్ళ వ్యాపార సంస్థకు ఈయనకు సంబంధం ఏంటి అని ప్రశ్నించారు.

Sajjala Ramakrishna Reddy: విజయసాయిరెడ్డికి ఒకరే కూతురు ఉన్నారని, అరెస్టు అయ్యింది ఆయన అల్లుడు కాదని, ఆయన అల్లుడి సోదరుడని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇవాళ ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. అరబిందో అనేది పెద్ద వ్యాపార సంస్థ అని చెప్పారు. వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న అంతర్జాతీయ వ్యాపార సంస్థ అని అన్నారు. విజయసాయిరెడ్డి వాళ్ళకి బంధువే కానీ.. వాళ్ళ వ్యాపార సంస్థకు ఈయనకు సంబంధం ఏంటి అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో డిల్లీ, కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య చాలా కాలంగా పొలిటికల్ వార్ జరుగుతుందని అన్నారు. దానికి ఏపీ ప్రభుత్వానికి, వైసీపీకి, విజయసాయిరెడ్డి, జగన్ కు సంబంధం ఏమిటని నిలదీశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో కలవకతప్పని పరిస్థితి వచ్చిందనే ఊహాచిత్రాన్ని ఆ పార్టీల నేతలు సృష్టిస్తున్నారని అన్నారు. అధికారం కోసం చంద్రబాబు, పవన్ కుట్ర బుద్ధి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు ఏకం కావడంలో తప్పు లేదని, తమకు అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు.

ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ తీరు బాలేదని ప్రచారం చెయ్యడంలోనూ తప్పులేదని అన్నారు. కలిసి లేనట్టు పైకి నటిస్తూ లోలోపల కలిసి పని చెయ్యడమే తప్పని చెప్పారు. జనసేన సభకు భూమి ఇచ్చిన వారిలో ఒక్కరు మినహా మిగతా ఎవరి ప్రహరీ గోడనూ అధికారులు కూల్చలేదని అన్నారు. ఇప్పటంలో జరిగిన కూల్చివేతల వెనుక వైసీపీ వాళ్ళు ఉన్నారని, ఒకే పార్టీ ఒకే వర్గం వాళ్ళు ఉన్నారనేది అవాస్తవమని చెప్పారు.

చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే పవన్, లోకేశ్ పర్యటనలు జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేదని, ఏదేదో జరిగిపోతుందని ఓ కుట్ర పూరితంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. వైసీపీ మరోసారి అధికారంలోకి రాకుండా చెయ్యాలని కుతంత్ర రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. మహిళలకి సీఎం జగన్ 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5 వేల కోట్లు ఇళ్ల నిర్మాణం కోసం కర్చు చేశామని అన్నారు.
2014 నుండి 2019 వరకు ఎన్ని ఇళ్లు కట్టారో చంద్రబాబుని పవన్ అడిగారా? అని నిలదీశారు.

మూడు సెంట్ల స్థలం ఇస్తామని చంద్రబాబు, పవన్ కలిసి హామీ ఇచ్చారని, ఐదేళ్లలో ఒక్క సెంటు కూడా ఇవ్వలేదని అన్నారు. పార్టనర్ ప్రభుత్వంలో ఒక్క సెంట్ స్థలం ఇప్పించలేని పవన్ ఇప్పుడు సోషల్ ఆడిట్ చేస్తాడట అని ఎద్దేవాచేశారు. లోకేశ్ పై నమ్మకం లేక దత్తపుత్రుడినీ తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి చంద్రబాబుకు వచ్చిందంటూ విమర్శించారు. రేపు సోషల్ ఆడిట్ కి వస్తున్న పవన్ ని ప్రజలు గట్టిగా నిలదీయాలని చెప్పారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు