బెజవాడ గ్యాంగ్ వార్.. సందీప్ మృతదేహం నేరుగా స్మశాన వాటికకు తరలింపు

  • Published By: srihari ,Published On : June 1, 2020 / 08:39 AM IST
బెజవాడ గ్యాంగ్ వార్.. సందీప్ మృతదేహం నేరుగా స్మశాన వాటికకు తరలింపు

విజయవాడలో గ్యాంగ్ వార్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. గ్యాంగ్ వార్ లో ప్రాణాలు కోల్పోయిన సందీప్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. మృతదేహాన్ని పోలీసులు నేరుగా స్మశాన వాటికకు తరలించారు. అంత్యక్రియలు కేవలం పది మందికే అనుమతి ఇచ్చారు. గ్యాంగ్ వార్ ఘటనలో గాయపడిన పండ్ గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసు దర్యాప్తుకు ఏడుగురు బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. 

గ్యాంగ్ వార్ లో గాయపడిన మణికంఠ అలియాస్ పండు కోలుకుంటున్నట్లు జీజీహెచ్ డాక్టర్లు వెల్లడించారు. న్యూరో సర్జరీ విభాగంలో అతనికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఊపిరితిత్తులు కొద్దిగా డ్యామేజ్ అయ్యాయని తెలిపారు. పండ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. తలపై చిన్న చిన్న గాయాలున్నాయని వెల్లడించారు.

బెజవాడ గల్లీ గ్యాంగ్ వార్ పోలీసులకు సవాల్ గా మారింది. మొన్న సాయంత్రం జరిగిన ఘర్షణలో దాదాపు 30 మంది పాల్గొని రాళ్లు, కత్తులు దాడులు సరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో సందీప్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి పండు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఘర్షణలో పాల్గొన్న వారి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఘర్షణలో ఎవరెవరు పాల్గొన్నారని  అన్వేషిస్తున్నారు. ఇప్పటికీ పోలీసుల అదుపులో ఇద్దరు ఉన్నట్లుగా సమాచారం. 

మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు ఘర్షణలో పాల్గొన్న వారిని సీసీ కెమెరాల్లో గుర్తిస్తున్నారు. ఇరు వర్గాల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. మరోవైపు పోలీసుల వైఫల్యమంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. 

గ్యాంగ్ వార్ తో విజయవాడ మరోసారి ఉలిక్కి పడింది. కత్తులు, కర్రలు, రాళ్లతో ఇరు వర్గాల విధ్వంసం చేశారు. గల్లీ గ్యాంగ్ వార్ పోలీసులకు సవాల్ గా మారింది. బెజవాడలో ఉద్రిక్త త కొనసాగుతోంది. 

Read: బెజవాడలో Gang war : పట్టపగలే కొట్టుకున్నారు..ఒకరి మృతి..ఏం జరిగింది