సంగం డెయిరీ స్వాధీనం జీవో రద్దు చేసిన హైకోర్టు

సంగం డెయిరీ స్వాధీనం జీవో రద్దు చేసిన హైకోర్టు

Sangam Dairy

Sangam Dairy: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీలో కేసులో ఏపీ ప్రభాత్వానికి షాక్ తగిలింది. సంగం డెయిరీ పరిశ్రమను తమ అధీనంలోకి తీసుకోవాలని భావించిన ప్రభుత్వం నిర్ణయానికి ఆటంకం కలిగింది. సంగం డెయిరీని తమ ఆధీనంలోకి తీసుకు వస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను కొట్టివేసింది హైకోర్టు.

ఈ జీవోపై సవాల్ చేస్తూ హైకోర్టులో సంగం డెయిరీ డైరెక్టర్లు పిటిషన్ వేయగా.. పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు ప్రభుత్వ జీవోను కొట్టివేస్తూ.. ఆస్తుల అమ్మకంపై కోర్టు అనుమతి తప్పనిసరి చేస్తూ తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లే కొనసాగవచ్చని స్పష్టంచేసింది. సంస్థ ఆస్తులు అమ్మాలన్నా.. కొనాలన్నా కోర్టు అనుమతి తప్పనిసరి చేసింది.

సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ.. ఏపీ సీఐడీ అధికారులు ఇప్పటికే డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రతో పాటు ఎండీ గోపాలకృష్ణన్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వీరిద్దరికి కారోనా పాజిటివ్ నిర్ధారణ కాగా చికిత్స పొందుతున్నారు. దీంతో విచారణ కష్టమైనట్లు హైకోర్టుకు సీఐడీ అధికారులు తెలిపారు.