ఎలా జరిగింది : శానిటైజ్ అనుకుని వాటర్ తాగిన వైద్యాధికారి

  • Published By: madhu ,Published On : April 10, 2020 / 04:56 AM IST
ఎలా జరిగింది : శానిటైజ్ అనుకుని వాటర్ తాగిన వైద్యాధికారి

కరోనా వైరస్ ఓ వైపు భయకంపితులను చేస్తోంది. వైరస్ బారిన పడిన రోగులకు అహర్నిశలు వైద్యం అందిస్తున్నారు వైద్యాధికారులు. వీరు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఏపీ రాష్ట్రంలో వైరస్ రోగుల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. తాజాగా మంచినీళ్లు అనుకుని శానిటైజర్ తాగారు అనీల్ కుమార్ వైద్యాధికారి. ఇతడిని బస్టాండు సమీపంలో ఉన్న క్రాంతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. 

అనంతపురంలో కరోనా కలకలం రేపుతోంది. వైద్యాధికారులు ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వారికి వైరస్ సోకిందని, సరిపడా మాస్క్ లు, రక్షణ పరికరాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ 2020, ఏప్రిల్ 09వ తేదీ గురువారం..నిరసనలు వ్యక్తం చేశారు. దీనిని పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు హామినిచ్చారు.

ఈ క్రమంలో 2020, ఏప్రిల్ 09వ తేదీ గురువారం రాత్రి అనీల్ కుమార్ శానిటైజ్ తాగారు. మంచినీరు అనుకుని తాగాడని ఇతర అధికారులు చెబుతున్నారు. కానీ శానిటైజర్ నోట్లోకి వేసుకోగానే..తెలిసిపోతుందని..వెంటనే ఉమ్మి వేయడం జరుగుతుందంటున్నారు. విషయం తెలుసుకున్న ప్రజాప్రతినిధులు ఆయన్ను పరామర్శించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.